Anand Mahindra: సింధుకు ఆనంద్‌ మహీంద్ర థార్‌ కారు ఇవ్వాల్సిందే.. నెటిజన్ ట్వీట్‌కు స్పందిస్తూ ఆనంద్‌ ఏమన్నారుంటే..

Anand Mahindra: ఒలింపిక్స్‌లో రెండుసార్లు వ్యక్తిగత పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆదివారం సింధు 21-13, 21-15 తేడాతో చైనాకు చెందిన...

Anand Mahindra: సింధుకు ఆనంద్‌ మహీంద్ర థార్‌ కారు ఇవ్వాల్సిందే.. నెటిజన్ ట్వీట్‌కు స్పందిస్తూ ఆనంద్‌ ఏమన్నారుంటే..
Anand Mahindra Pv Sindhu

Updated on: Aug 02, 2021 | 9:12 PM

Anand Mahindra: ఒలింపిక్స్‌లో రెండుసార్లు వ్యక్తిగత పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆదివారం సింధు 21-13, 21-15 తేడాతో చైనాకు చెందిన హీ బింగ్జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా సింధుకు కాంగ్రాట్స్‌ చెబుతున్నారు. ఇక రాజకీయ నాయకుల నుంచి మొదలు సినీ తారల వరకు సెలబ్రిటీలంతా సింధు దేశానికి గర్వకారణం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్‌.. ‘సింధు ఒలింపిక్స్‌లో చూపిన ఈ ప్రదర్శనకు తనకు థార్‌ కారు అందించాలి’ అంటూ ఆనంద్‌ మహీంద్రను ట్యాగ్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు హుందాగా స్పందించిన ఆనంద్‌ మహీంద్ర.. ‘ఇపాటికే సింధు గ్యారేజీలో థార్‌ కారు ఉంది’ అంటూ రీ కామెంట్‌ చేశాడు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు, సాక్షి మాలిక్‌లకు ఆనంద్‌ మహీంద్ర థార్‌ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సింధు సిల్వర్‌ మెడల్‌ను గెలుచుకోగా, సాక్షి మాలిక్‌ కాంస్య పతకాన్ని అందుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్ర సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలో క్రీడారంగంలో ఉత్తమ ప్రతిభను కనభరిచిన వారికి ఆనంద్‌ మహీంద్ర తమ కంపెనీకి చెందిన థార్‌ కార్లను బహుమతిగా ఇచ్చిన విషయం విధితమే.

Also Read: Viral Photos : ప్రపంచంలో ఈ 5 అందమైన సరస్సులు చాలా ప్రమాదకరమైనవి..! ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి..

Water on Mars: అంగారక గ్రహం నుండి వచ్చిన రాడార్ సిగ్నల్స్ నీటికి సంబంధించినవి కావు..అక్కడ ఇంకేదో జరుగుతోంది..

Jamun fruit Benefits: నేరేడు పండ్లు అంటే మీకు ఇష్టం ఉండదా..? ఈ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు