రెండోరోజు పట్టుబిగించిన టీమిండియా..

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. తొలిరోజు టాప్ అర్డర్ బ్యాట్స్‌మెన్ తడబడ్డా.. చివరకు గౌరవప్రధమైన స్కోర్ నమోదు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు భారత బౌలర్లు చుక్కలుచూపించారు. రెండో రోజు 203/6 ఓవర్ నౌట్ స్కోర్‌తో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. టెయిలెండర్ల సహాయంతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను ఇషాంత్‌ శర్మ కట్టడి చేశాడు. 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడంతో […]

రెండోరోజు పట్టుబిగించిన టీమిండియా..

Edited By:

Updated on: Aug 24, 2019 | 8:00 AM

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. తొలిరోజు టాప్ అర్డర్ బ్యాట్స్‌మెన్ తడబడ్డా.. చివరకు గౌరవప్రధమైన స్కోర్ నమోదు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు భారత బౌలర్లు చుక్కలుచూపించారు. రెండో రోజు 203/6 ఓవర్ నౌట్ స్కోర్‌తో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. టెయిలెండర్ల సహాయంతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను ఇషాంత్‌ శర్మ కట్టడి చేశాడు. 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడంతో విండీస్ కష్టాల్లో పడింది. రోచ్‌ ఒక్కడే 74 బంతుల్లో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్‌ 108 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.