స్పోర్ట్స్ లో ఎప్పుడు ఎటువంటి సంచలనం జరుగుతుందో చెప్పలేం. వరల్డ్ చాంఫియన్స్ కూడా చిన్న జట్లపై ఓడిపోవచ్చు. అప్పటివరకు ఎవరికి తెలియని ఓ వ్యక్తి అమాంతం ప్రపంచం మొత్తానికి పరిచయం కావచ్చు. సరిగ్గా అదే జరిగింది. ఐపీఎల్ తర్వాత చాలా దేశాలు టీ20 లీగ్ లను నిర్వహిస్తోంది. ఈ లీగ్ మ్యాచ్ ల ద్వారా యువ క్రికెటర్లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. వీటిలో సత్తా చాటితో తమ దేశం తరపున ఐసీసీ మ్యాచ్ లు ఆడే అవకాశాలు దక్కించుకుంటున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ టి20 క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. సీఎస్‌ఏ చాలెంజ్ లీగ్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రెవిస్ 57 బంతుల్లోనే 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 162 పరుగులు సాధించి బౌలర్లను ఊచకోత కోశాడు. 35 బంతుల్లోనే సెంచరీ సాధించిన బ్రెవిస్ ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేయగా, 52 బంతుల్లో 150 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు టీ20 ఫార్మట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో 175 పరుగులతో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఉండగా, ఆ తరువాత స్థానంలో 172 పరుగులతో ఆస్ట్రేలియా ఆటగాడు ఫించ్ ఉన్నారు. ఆ ఇద్దరి తర్వాత టి20 క్రికెట్‌లో డెవాల్డ్ బ్రెవిస్ మూడో అత్యుత్తమ స్కోరర్ గా నిలిచాడు.
బ్రెవిస్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సోమవారం నైట్స్, టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. 162 పరుగుల బ్రెవిస్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. బ్రెవిస్ తో పాటు మరో ఓపెనర్ పిళ్లై 52 పరుగులతో రాణించాడు. అనంతరం 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్స్ 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులకే పరిమితమైంది. తద్వారా నైట్స్‌పై 41 పరుగుల తేడాతో టైటాన్స్ విజయం సాధించింది.
సీఎస్ ఎ టీ20 ఛాలెంజ్‌లో 162 పరుగులు చేసి సంచలనం సృష్టించిన 19 ఏళ్ల డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతమైన ఇన్నింగ్స్‌పై పలువురు క్రికెటర్లు ప్రశంసలతో ముంచెత్తారు. బ్రెవిస్ ఆటతో దక్షిణాఫ్రికా ప్రముఖ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో కొన్ని పోలీకల కారణంగా బ్రువిస్ ను ‘బేబీ ఏబీ’ గా పిలుస్తారు. టీ20 ఫార్మట్ లో తన మొదటి సెంచరీని చేసిన బ్రెవిస్ 284.21 స్ట్రైక్-రేట్ తో 57 బంతుల్లోనే 162 పరుగులు చేశాడు.
Dewald Brevis. No need to say more
— AB de Villiers (@ABdeVilliers17) October 31, 2022
52 బంతుల్లో 150 పరుగులు చేసి బ్రెవిస్ 57 బంతుల్లో 162 పరుగులు చేశాడు. పురుషుల T20ల్లో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన దక్షిణాఫ్రికా ఆటగాడిగా బ్రెవిస్ నిలిచాడు. క్వింటాన్ డి కాక్ 20 ఏళ్ల 62 రోజుల వయసులో 2013లో కేప్ కోబ్రాస్‌పై 126 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇప్పటివరకు అతి పిన్న వయసులో సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా డికాక్ పేరిట ఉన్న రికార్డును బ్రేవిస్ అధిగమించాడు. బ్రెవిస్ పై అనేక మంది క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప సైతం బ్రెవిస్ ను అభినందించారు.
Watching a masterclass from Dewald Brevis. Bowlers will be under serious pressure for the next 15+ years.
— Albie Morkel (@albiemorkel) October 31, 2022
Wow!! This is incredible!! Well done @BrevisDewald ???? https://t.co/Azx9ejFOYE
— Robin Aiyuda Uthappa (@robbieuthappa) October 31, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..