సామాజిక సమస్యను తట్టిలేపేలా.. మామ్స్‌ మ్యాజిక్‌ కొత్త ప్రకటన. ‘విల్‌ ఆఫ్‌ చేంచ్‌’ పేరుతో..

ప్రముఖ బిస్కట్స్ తయారీ సంస్థ సన్ ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ సరికొత్త క్యారక్రమాన్ని ప్రారంభించారు. విల్ ఆఫ్ ఛేంజ్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు లభించడం లేదన్న ఓ సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకొని 'విల్ ఆఫ్ చేంజ్' పేరుతో ప్రచారం చేపట్టారు..

సామాజిక సమస్యను తట్టిలేపేలా.. మామ్స్‌ మ్యాజిక్‌ కొత్త ప్రకటన. 'విల్‌ ఆఫ్‌ చేంచ్‌' పేరుతో..
Moms Magic
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 25, 2024 | 4:59 PM

భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం.. కుమారులు, కుమార్తెలు కుటుంబ ఆస్తిని వారత్వంగా పొందేందుకు సమాన హక్కులు కలిగి ఉండాలి. కానీ ఇది ఆచారణలో మాత్ర సాధ్యం కావడం లేదు. సన్‌ఫీస్ట్‌ మామ్స్‌ మ్యాజిక్‌ చేసిన పరిశోధన ప్రకారం దేశంలో కేవలం 7 శాతం కుమార్తెలు మాత్రమే వీలునామా ద్వారా సమాన వారసత్వాన్ని పొందుతున్నారు. కుమార్తెలు ఎప్పటికైనా వేరొకరి బాధ్యత అనే విశ్వాసం ఇప్పటికే చాలా మంది భారతీయ కుటుంబాల్లో ప్రబలంగా ఉంది.

ఇందులో భాగంగానే ఈ సామాజిక సమస్యను ప్రపంచానికి చాటేలా సన్‌ఫీస్ట్ మామ్స్‌ మ్యాజిక్‌ సందేశాత్మక ప్రచారాన్ని రూపొందించింది. ఈ విషయమై ఐటిసి లిమిటెడ్ ఫుడ్స్ డివిజన్ బిస్కెట్స్ అండ్‌ కేక్స్‌ క్లస్టర్‌ చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్ అలీ హారిస్ షేర్ మాట్లాడుతూ.. ప్రచారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రతదేశంలో చాలా మంది తల్లులు తమ తల్లిదండ్రుల వారసత్వ విషయాలలో అన్యాయానికి గురవుతున్నారు. వారి కుమార్తెల కోసం వారి స్వంత కుటుంబాల్లో ఇప్పుడు నిజంగా మార్పును తీసుకురాగలవారు. ‘విల్ ఆఫ్ చేంజ్’ ప్రచారం ద్వారా, కుమార్తెలకు సమాన వారసత్వ హక్కులను నిర్ధారించడానికి, అలాగే మార్పునకు తల్లులను ప్రేరేపిస్తుందని మేము ఆశిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.

దేశంలోని తల్లుల ఆలోచనల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ఐటీసీ సన్‌ఫీస్ట్‌ మామ్స్‌ మ్యాజిక్‌ గత ప్రచారాల ద్వారా వారికి స్ఫూర్తినిస్తోంది. విల్‌ ఆఫ్‌ చేంజ్‌ పేరుతో సరికొత్త క్యాంపెయిన్‌కు తెర తీసింది. వారసత్వ విషయాలలో కుమార్తెలను పట్టించుకోకుండా చూసే సామాజిక పక్షపాతంపై దృష్టిసారించింది. సమాజం సమానత్వం వైపు మళ్లాలనే సందేశాన్ని ఇస్తోంది. ఈ కీలకమైన ఉద్యమానికి నాయకత్వం వహించి, #MomOfChangeగా మారేందుకు వారిని శక్తివంతం చేయాలని, మార్పునకు మూల స్తంభాలుగా నిలవాలని తల్లులకు పిలుపునిస్తోంది.

మాతృమూర్తి అత్యంత శక్తివంతమైన వ్యక్తి అని, తన పిల్లలకు ఎదురయ్యే పక్షపాతాల్లో సరిగ్గా ఎదురించగలదని తామము విశ్వసిస్తున్నట్లు సన్‌ఫీస్ట్‌ భావిస్తోంది. ‘విల్ ఆఫ్ చేంజ్’ చొరవతో’ సన్‌ఫీస్ట్‌.. సమాజంలో అత్యంత పాతుకుపోయిన పక్షపాతాలలో ఒకదాన్ని తీసుకొని, ఈ మార్పునకు బాధ్యత వహించేలా తల్లులను ప్రేరేపిస్తుందని చెప్పుకొచ్చారు.

ఇక మామ్స్‌ మ్యాజిక్‌ ప్రకటన వీడియో విషయానికొస్తే.. షెఫాలీ షా, మనీష్ చౌదరి నటించిన ఈ యాడ్‌ ఎంతో భావోద్వేగం, ఆలోచన రేకెత్తించేలా ఉంది. వారసత్వ నిర్ణయాలు తరచూగా కూతుళ్లను ఎలా విస్మరిస్తాయో ఈ యాడ్‌లో ప్రముఖంగా చూపించారు. ఆస్తిలో వాటా కేవలం కుమారుడికి మాత్రమే చెల్లుతుందన్న తండ్రి ఆలోచన తప్పు అనే విషయాన్ని ఇందులో చక్కగా చూపించారు. రోజువారీ జీవితంలో అవసరాలకు కుమార్తెలను బేటా అని సంబోధించే వాళ్లు, వారసత్వం విషయానికి వచ్చే సరికి ‘బేటీ’ అవుతుందనే డైలాగ్‌ ఆకట్టుకుంటుందోంది. భార్య చెప్పిన విషయాలకు వాస్తవాన్ని గ్రహించిన భర్త.. పునరాలోచించుకొని ఆస్తిలో కూతురుకు కూడా సమాన వాట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటాడు. పూర్తి వివరాలతో పాటు, ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు వెబ్‌సైట్‌ను సందర్శించండి.