Money9: ఆ షేర్స్ మళ్లీ పుంజుకునేనా.? మదుపరులకు లాభాలు తెచ్చిపెట్టేనా.!

|

Aug 01, 2022 | 4:02 PM

Money9: మెటల్ స్టాక్‌ల షేర్లు ఇటీవల చాలా వరకు క్షీణించించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే మళ్లీ మెటల్‌ షేర్స్‌ పుంచుకుని మదుపరులకు లాభాలు తెచ్చిపెట్టేనా..

Money9: ఆ షేర్స్ మళ్లీ పుంజుకునేనా.? మదుపరులకు లాభాలు తెచ్చిపెట్టేనా.!
Metal
Follow us on

Money9: మెటల్ స్టాక్‌ల షేర్లు ఇటీవల చాలా వరకు క్షీణించించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే మళ్లీ మెటల్‌ షేర్స్‌ పుంచుకుని మదుపరులకు లాభాలు తెచ్చిపెట్టేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. గత మూడు నెలల్లో BSE మెటల్ ఇండెక్స్ 20% కంటే ఎక్కువ పడిపోయింది. అయితే ఈ కాలంలో BSE సెన్సెక్స్ కేవలం రెండు శాతం మాత్రమే నష్టపోయింది. జూలైలో ఈ రంగం గ్రీన్‌మార్క్‌లో కనిపిస్తున్నప్పటికీ, ఈ రికవరీ ఎంత బలంగా ఉంది, ఎంతకాలం కొనసాగుతుంది.. అనే ప్రశ్న తలెత్తుతోంది. మెటల్ స్టాక్‌లలో విక్రయించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అన్నింటిలో మొదటిది ద్రవ్యోల్బణం. కరోనా తర్వాత గత రెండేళ్లలో చాలా దేశాలు ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచాయి. దీని తరువాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సరఫరా అడ్డంకులకు దారితీసింది. ద్రవ్యోల్బణం పరిస్థితి మరింత దిగజారింది. ఇది కాకుండా గ్లోబల్ ఎకానమీలో మందగమనం, చైనా నుండి తక్కువ లేదా అనిశ్చిత మెటల్ డిమాండ్‌ ఉంది., US సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను అనేకసార్లు పెంచింది.

ఒక విధంగా చెప్పాలంటే వీటన్నింటి వల్ల లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో మెటల్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. దేశీయ సరఫరాను పెంచడానికి 21 మే 2022న భారత ప్రభుత్వం ఉక్కు ఉత్పత్తులపై 15% ఎగుమతి సుంకాన్ని విధించింది. దీని కారణంగా జూన్ 2022లో ఉక్కు ఉత్పత్తుల ధరలు 12 శాతం తగ్గాయి.

మనీ9 అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

Money9 OTT యాప్ ఇప్పుడు Google Play, iOSలో అందుబాటులో ఉంది. వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రతి సమాచారం.. ఏడు భాషల్లో ఇందులో అందుబాటులో ఉంటుంది. దీనిలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైనవి సవివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆదాయం, బడ్జెట్‌ను ప్రభావితం అంశాలను కూడా తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోని.. మీ ఆర్థిక అవగాహనను మరింత పెంచుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి