LIC Schemes: ఎల్‌ఐసీలో అద్భుతమైన పథకాలు.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో రాబడి!

|

Sep 23, 2022 | 3:15 PM

LIC Schemes: లైఫ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC)లో రకరకాల స్కీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే పథకాలు ఉన్నాయి..

LIC Schemes: ఎల్‌ఐసీలో అద్భుతమైన పథకాలు.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో రాబడి!
Lic
Follow us on

LIC Schemes: లైఫ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC)లో రకరకాల స్కీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే పథకాలు ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలని భావించినట్లయితే ఎల్‌ఐసీలో పెట్టడం ఎంతో మేలు. మీ పెట్టుబడికి సెక్యూరిటీ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం వల్ల మీ కుటుంబానికి భద్రత ఉంటుంది. వీటిలో చాలా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. అయితే LICకి సంబంధించిన మూడు పథకాల గురించి తెలుసుకుందాం.

LIC జీవన్ ప్రగతి ప్లాన్:

ఇది LICకి చెందిన ప్రసిద్ధ పాలసీ. ఇది 2016 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక వ్యక్తి లక్షల రూపాయల రాబడిని పొందవచ్చు. దీనితో పాటు, పాలసీ కింద పెట్టుబడిదారుడు రిస్క్ కవర్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈ బీమా పథకంలో వ్యక్తి క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాలి. పాలసీలో పాలసీదారుడు ఏదైనా కారణంగా మరణించినట్లయితే ఆ ప్రయోజనాలు నామినీ పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరణ ప్రయోజనం:

ఈ ఎల్‌ఐసీలో ఈ పథకం కింద ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన వ్యక్తి మరణం ప్రయోజం కూడా పొందుతాడు. అయితే పాలసీదారుడు పాలసీని కొనుగోలు చేసిన 6 నుంచి 10 సంవత్సరాలలో మరణించినట్లయితే అతను మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అదే సమయంలో పాలసీ తీసుకున్న 6 నుంచి 10 సంవత్సరాల మధ్య మరణిస్తే 125% హామీ మొత్తం లభిస్తుంది. 11 నుంచి 15 ఏళ్లలో 150%, అదే 16క నుంచి 20 సంవత్సరాలలో అయితే 200 శాతం హామీ మొత్తం లభిస్తుందని గుర్తించుకోవాలి. మీరు రైడర్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఈ స్కీమ్‌లో 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది.. వ్యక్తి ప్రతి నెలకు 6 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. వ్యక్తులు12 సంవత్సరాల వయస్సు నుండి ఈ పాలసీని ప్రారంభించవచ్చు.

LIC జీవన్ శిరోమణి పాలసీ:

ఈ పాలసీ కింద వ్యక్తి జీవిత బీమాతో పాటు పొదుపు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో పెట్టుబడిదారుడు నిర్ణీత సమయానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కాలపరిమితి 14, 16, 18, 20 సంవత్సరాలు. . కానీ ప్రీమియం 4 సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి. ఆ తర్వాత రాబడి పొందుతారు. ఈ పాలసీకి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గనిష్ట హామీ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు.

ఈ బీమా పాలసీ కింద వ్యక్తి  ప్రతి నెల దాదాపు రూ.94,000 చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 1 కోటి. అదే సమయంలో గరిష్ట హామీ మొత్తంపై ఎటువంటి పరిమితి నిర్ణయించబడలేదు. ప్లాన్ కింద మీరు 14 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకుంటే మీరు 10వ సంవత్సరంలో 30 శాతం, 12వ సంవత్సరంలో 30 శాతం రాబడిని పొందుతారు. అదే సమయంలో 16 సంవత్సరాల పాలసీని తీసుకుంటే 12వ సంవత్సరంలో 30 శాతం, 14వ సంవత్సరంలో 35 శాతం చొప్పున డబ్బులు వస్తాయి. మనీ బ్యాక్ కూడా వస్తుంది కాబట్టి నిర్ణీత సమయంలో డబ్బులు కావాలనుకునేవారికి ఉపయోగపడే ప్లాన్ ఇది. ఈ ప్లాన్‌ను ఎంచుకుంటే ఎంతో మంచిది.

పాలసీ తీసుకున్న మొదటి ఐదు సంవత్సరాలలో వెయ్యికి రూ.50 చొప్పున, ఆరవ సంవత్సరం నుంచి ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసే వరకు రూ.55 చొప్పున అదనపు బోనస్‌ను అందజేస్తారు. ఎల్‌ఐపీ ప్రీమియం వార్షిక, ఆర్ధ సంవత్సరం, త్రైమాసికానికి, నెలవారీ చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత పాలసీని సరెండర్‌ చేసే అవకాశం ఉంది. పాలసీ తీసుకున్న ఒక సంవత్సరం తర్వాత పాలసీదారులు లోన్‌ పొందవచ్చు

LIC ఆధార్ శిలా ప్లాన్:

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ బీమా పాలసీ ప్రత్యేకంగా మహిళలు, బాలికల కోసం రూపొందించబడింది. ఈ పాలసీ కింద కేవలం రూ.29 పెట్టుబడితో మహిళ రూ.4 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ ప్లాన్ కింద వ్యక్తికి భద్రతతో పాటు పొదుపు ప్రయోజనం కూడా లభిస్తుంది. దీంతో పాలసీదారుడు మరణిస్తే అతని కుటుంబానికి కూడా ఆర్థిక భరోసా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో, ఒక మహిళ కనీస ప్రాథమిక హామీ మొత్తం రూ.75,000 తీసుకోవచ్చు. కాగా, గరిష్ట హామీ మొత్తం రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మెచ్యూరిటీ కాలం 10 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు ఈ పాలసీ కింద రోజుకు రూ.29 పెట్టుబడి పెట్టారనుకుందాం. మీరు 20 సంవత్సరాల కాలవ్యవధికి మొత్తం రూ. 2,14,696 పెట్టుబడి పెడతారు. పాలసీ కింద, మీరు మెచ్యూరిటీపై రూ. 3,97,000 మొత్తాన్ని పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి