దేశ ప్రజలు ఎంతో ఇష్టపడే ఆకర్షణీయమైన రూపంతో సరికొత్త Maruti Suzuki Alto K10.. తక్కువ ధర, అద్భుతమైన ఫీచర్స్ తో..
లక్షలాది మంది ప్రయాణీకుల మొదటి ఎంపికగా ఉన్న Maruti Suzuki సంస్థ నేటి తరానికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు.. పూర్తి భద్రతా ప్రమాణాలను పాటిస్తూ..
దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ Maruti Suzuki ఈ ఏడాది ఆగష్టులో తన సరికొత్త మోడల్ Alto K10 కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కారును కంపెనీ తయారుచేసింది. ప్రతి ఒక్కరూ ఇష్టపడేలా, అందరిని ఆకర్షించేలా సరసమైన బడ్జెట్ లో ఈ కారును Maruti Suzuki తయారుచేసింది. అందుబాటు ధరలో నాణ్యమైన కారుని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారికి Maruti Suzuki Alto K10 మంచి ఎంపిక కానుంది.
లక్షలాది మంది ప్రయాణీకుల మొదటి ఎంపికగా ఉన్న Maruti Suzuki సంస్థ నేటి తరానికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు.. పూర్తి భద్రతా ప్రమాణాలను పాటిస్తూ.. ‘ఇండియా కి చల్ పాడి’ అనే ట్యాగ్ లైన్‌తో మార్కెట్‌లోకి Alto K10 కారును విడుదల చేసింది.
Alto K10 కారు 15 కంటే ఎక్కువ భద్రతాపరమైన ఫీచర్లతో^ , ఎంతో ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌తో Maruti Suzuki కొత్త మోడల్ కారు సుజుకి సిగ్నేచర్ HEARTECT ప్లాట్‌ఫారమ్‌పై తయారుచేయబడింది. క్రాష్ స్ట్రెంత్, నాయిస్, వైబ్రేషన్, హార్‌ష్‌నెస్ ఇలా అన్నివిధాలా ఈ కారు మెరుగైన పనితీరును కనబరుస్తుంది.
సరికొత్త Alto K10 కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్ బెల్ట్ ఉన్నాయి. కారు యొక్క తాజా వెర్షన్ మెరుగైన భద్రతా ప్రమాణాలను కలిగి ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి లక్షణాలు కలిగి ఉంది. HEARTECT ప్లాట్‌ఫారమ్, హెడ్‌ల్యాంప్ లెవలింగ్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, బలమైన స్టీరింగ్ వంటి కొన్ని ఇతర ఫీచర్లు ఈకారులో ఉన్నాయి. Maruti Suzuki Alto K10 కారులో ఉన్న నాణ్యతా ప్రమాణాలు ఈ వాహనం అత్యంత సురక్షితంగా ఉండేలా చేస్తుంది. Alto K10 కారు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్-సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హై-స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
కొత్త Alto K10 పునరుద్దరించబడిన ఫ్రంట్ ఫాసియాను ఉపయోగించి శక్తివంతమైన సమకాలీన డిజైన్‌ను కలిగి ఉంది. కొత్త పెప్పీ హెడ్ ల్యాంప్‌లు, డైనమిక్ హనీకోంబ్ ప్యాటర్న్ గ్రిల్ వంటివి అమర్చడం ద్వారా కారు ముందు భాగం బలంగా ఉండడానికి దోహదం చేస్తుంది. Alto పాత మోడళ్ల కార్లకు ఐకానిక్‌గా ఉన్న రియర్ కాంబినేషన్ ల్యాంప్‌లను ఈ కొత్త కారుకు ట్రెండీ కొత్త లుక్‌ను అందించే విధంగా డిజైన్ చేసి అమర్చడబడ్డాయి. కొత్త ఫుల్-వీల్ కవర్‌లతో కూడిన పెద్ద R13 చక్రాలు కారు ధృడంగా ఉడంటంతో పాటు రోడ్లపై ఎటువంటి సమస్యలు లేకుండా ప్రయాణించడానికి సహాయపడతాయి.
కారు ఇంటీరియర్ డెకరేషన్ చూసుకుంటే Maruti Suzuki సంస్థకు చెందిన గత మోడళ్లకు భిన్నంగా పూర్తిగా పునరుద్ధరించబడింది. కొత్త క్యాబిన్ డిజైన్ ఎంతో విలాసంగా ఉండనుంది. చూడటానికి ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ (IP) పైన ఉన్న కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్‌లో ఆడియో యూనిట్ ఎంతో ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది. ఇండిరీయర్ డేకరేషన్ విషయానికి వస్తే కారు డోర్స్ మొదలు సెంటర్ కన్సోల్ వరకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఎంతో ఫ్రీ స్పేస్ ఉన్న అనుభూతిని ఈ కారు కలిగించనుంది. లేత గోధుమరంగు, బూడిద రంగుతో ఉన్న యాక్సంటెడ్ సీట్లు ఈ కారు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇవ్వన్ని చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించనున్నాయి.
17.78cm (7-అంగుళాల) SmartPlay స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ Apple CarPlay, Android Auto, ఇతర SmartPlay స్టూడియో యాప్‌లతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం వంటి సౌకర్యాలు ఈ కారులో ఉన్నాయి. దీంతో కారులో ప్రయాణించేవారు ఎంతో అమితానందాన్ని పొందొచ్చు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, వాయిస్ నియంత్రణలు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యొక్క ప్రత్యేకతలు కాగా.. ఈ సౌకర్యాలన్ని కారు యజమానికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి.
సరికొత్త Alto K10 కారు పనితీరును చూస్తే నెక్స్ట్-జెన్ K-సిరీస్ 1.0L డ్యూయల్ జెట్ ఇంజన్, కొత్త ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ (AGS) ట్రాన్స్‌మిషన్ వంటి సౌకర్యాలు ఈకారులో ఉన్నాయి. ఈ కారు డ్రైవ్ చేసేటప్పుడు విసుగు లేకుండా.. సున్నితంగా డ్రైవింగ్ చేసే అనుభవాన్ని కలిగిస్తోంది. ఇంజిన్ 5500rpm గరిష్ట శక్తి వద్ద 66.62PS, 3500rpm గరిష్ట టార్క్ వద్ద 89Nm శక్తిని విడుదల చేయగలదు. అదే సమయంలో ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కు వరుసగా ఒక లీటరు ఇంధనానికి 24.90 కిలోమీటర్లు#, 24.39 కిలోమీటర్ల మైలేజీని# అందిస్తుంది. Alto K-10 S-CNG యొక్క K10C CNG ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 5500 rpm వద్ద 65.26PS, CNG మోడ్‌లో 5300 rpm వద్ద 56.69PS శక్తిని అందిస్తుంది. ఈ కారు CNG వేరియంట్ ఒక కిలో సీఎన్‌జికి 33.85 కిలోమీటర్ల మైలేజి#ని ఇచ్చే అవకాశం ఉంది.
Maruti Suzuki Alto వాహనం 43 లక్షల* మంది కస్టమర్లతో దేశంలో నెంబర్ వన్ హ్యాచ్‌బ్యాక్‌గా గత 16 సంవత్సరాలుగా కొనసాగుతోంది. గత 22 సంవత్సరాలుగా ప్రతి గంటకు 100 Alto కార్లు విక్రయించబడుతున్నాయి. Alto K10 ఆధునిక తరానికి కొత్త వారసత్వాన్ని అందించగలదనడంలో సందేహం లేదు. ఈ కారు కొత్త హ్యాచ్‌బ్యాక్ స్టాండర్డ్, Lxi, Vxi, Vxi+ అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో కలదు. AGS Alto K10 రెండు అత్యధిక వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. Maruti Suzuki ఈ కారును ఇంపాక్టో, గ్లింటో అనే రెండు యాక్సెసరీ థీమ్‌లతో అందిస్తోంది.
Alto K10 కొత్తగా ప్రారంభించబడిన మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ స్పీడీ బ్లూ, ప్రీమియం ఎర్త్ గోల్డ్‌తో సహా ఆరు రంగుల్లో లభిస్తుంది.
# CMVR 1989 యొక్క నియమ నిబంధనలు 115 ప్రకారం టెస్ట్ ఏజెన్సీ ద్వారా ధృవీకరించబడిన ఇంధన సామర్థ్యాన్ని ఈ కారు కలిగి ఉంది.
^ ఎయిర్ బ్యాగ్‌తో సహా భద్రతా ప్రమాణాలకు సంబంధించిన వివరాల కోసం ఓనర్స్ మాన్యువల్‌ని చూడండి.
* జూలై 2022 వరకు జరిగిన ఆల్టో అమ్మకాలు