Zodiac Sign Taurus: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృషభ రాశి వారు ప్రతీ విషయంలో ప్రాక్టికల్‌గా ఉంటారు. వీరు.. అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. భౌతిక విషయాల పట్ల ఇట్టే ఆకర్షితులవుతారు. వీరు పని చేయడానికి ఆసక్తి చూపుతారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లైఫ్‌స్టైల్‌ను మెయింటేన్ చేస్తుంటారు. ఇంకా ముఖ్యంగా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. వారు ఎంచుకున్న వర్కౌట్ స్టైల్ ఏదైనా.. రోజు రోజు శారీరక శ్రమను పెంచుతారే తప్ప తగ్గించరట. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ ఐదు వర్కౌట్స్‌ని ఇష్టపడుతారట. మరి ఆ వర్కౌట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రాస్ ఫిట్..
క్రాస్‌ఫిట్ చాలా కష్టమైన వర్కౌట్. ఇందులో భాగంగా రకరకాల వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఈ రిచ్ వర్కౌట్‌ను వృషభరాశి వారు ఎంచుకుంటారట. మరో కీలక విషయం ఏంటంటే.. ఈ రాశి వారి పోటీ తత్వాన్ని ఆస్వాదిస్తారు. అందుకే.. ఇతరులతో వ్యాయామం చేసేటప్పుడు మరింత ఉత్సాహంగా చేస్తారట.
జుంబా..
వృషభ రాశి వ్యక్తులు డ్యాన్స్ చేయడాని ఆసక్తి చూపుతారు. వారు మంచి డ్యాన్సర్ కాకపోయినప్పటికీ.. తనకు వచ్చిన డ్యాన్స్‌ని ఆస్వాధిస్తారు. డ్యాన్స్ రిథమ్, టెంపోను ఎంజాయ్ చేస్తారు. ఫిట్‌గా ఉండేందుకు వీరు డ్యాన్స్‌తో కూడిన వర్కౌట్ అయిన జుంబాను ఎంచుకుంటారట.
రన్నింగ్..
ఈ రాశి వ్యక్తులు ఇతరులతో పోటీ పడటానికి ఆసక్తి చూపుతారు. వీరు రన్నింగ్‌ను బాగా ఇష్టపడతారు. స్నేహితులతో కలిసి రన్నింగ్, జాగింగ్ చేస్తారు. కీలక విషయం ఏంటంటే.. వీరు ప్రకృతిని ఇష్టపడుతారు. ఆ కారణంగా.. జిమ్‌లో కంటే సహజ వాతవరణంలో రన్నింగ్ చేయడానికి ఆసక్తి చూపుతారు.
బాక్సింగ్..
వృషభరాశి వారు బాక్సింగ్‌ను బాగా ఇష్టపడుతారు. ఇతరులతో పోటీ పడటానికి ఇది అనుకూలమైందిగా వారు భావిస్తారు. అందుకే బాక్సింగ్‌ను ప్రాక్టీస్ చేస్తారట.
హెచ్ఐఐటి..
వృషభ రాశి వారు హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్‌ను ఎంచుకుంటారట. ఇది హృదయానికి మేలు చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ కాలరీలను బర్న్ చేసే ఎక్సర్‌సైజ్. అందుకే దీనికి వారు అమితంగా ఇష్టపడుతారట.
Also read: