Astrology Remedies: భర్త ఆదాయం పెరగాలంటే మహిళలు ఈ ఒక్క పని చేయండి.. జ్యోతిష్య నిపుణులు చేప్పే మాట

భర్త ఉద్యోగానికి లేదా వ్యాపార పనుల మీద ఇంటి నుంచి బయటికి వెళ్లగానే వెంటనే ప్రధాన ద్వారం మూసేయకూడదు. కనీసం ఐదు నిమిషాల తర్వాత తలుపు వేస్తే మంచిది. భర్త వెళ్లిన వెంటనే ఇంటిని ఊడ్చడం లేదా తడి వస్త్రంతో తుడవడం చేయకూడదు. భర్త బయటికి వెళ్ళగానే స్నానం చేయడానికి వెళ్లకూడదు. ఐదు నిమిషాలు ఆగి వెళ్లాలి. ఉతికిన దుస్తులను మడతపెట్టేటప్పుడు తలకిందులుగా ఫోల్డ్ చేయకూడదు. ఇలా చేస్తే భర్తకు అదృష్టం కలిసిరాదని చెబుతారు.

Astrology Remedies: భర్త ఆదాయం పెరగాలంటే మహిళలు ఈ  ఒక్క పని చేయండి.. జ్యోతిష్య నిపుణులు చేప్పే మాట
Money Flow Remedies

Updated on: Jun 04, 2025 | 1:27 PM

ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కుటుంబంలో ధన వృద్ధి కలగాలంటే భర్త సంపాదన పెరగాలి. దీనికి మహిళలు కొన్ని పనులు చేస్తే మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

ధనాకర్షణకు కొన్ని మంత్రాలు, చిట్కాలు:

ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి. దీనివల్ల భర్తకు అదృష్టం కలిసి వచ్చి, ధనార్జన పెరుగుతుంది. “ఓం సర్వేశ్వరీ సర్వశక్తి స్వరూపిణి.. మమ కుటుంబ రక్షాం.. కురు కురు స్వాహాః..” ఉదయాన్నే టీ పెట్టడానికి లేదా టిఫిన్లు తయారు చేయడానికి వంటగదిలోకి వెళ్ళినప్పుడు, స్టవ్ వెలిగించే ముందు “ఓం బ్రహ్మణే నమః” అనే మంత్రాన్ని జపించడం వల్ల భర్త సంపాదన పెరుగుతుందని అంటారు. భర్త అదృష్టం కోసం, ఉదయం నిద్రలేవగానే మహిళలు వినాయకుడి ఫోటో చూసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి.
ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎండుద్రాక్షలను నైవేద్యంగా సమర్పించాలి.

యాలకుల ప్రాముఖ్యత:

వంటింట్లో యాలకులు ఎండిపోకుండా, ఆకుపచ్చ రంగులోనే ఉండేలా చూసుకోవాలి. ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శుక్రవారం ఒక పసుపు వస్త్రంలో ఐదు యాలకులను వేసి మూటకట్టండి. ఈ మూటను బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టాలి.
పూజా మందిరంలో కూడా ఐదు యాలకులు ఉంచవచ్చు. భర్త పర్సులో ఐదు యాలకులు ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం.

ఇతర ముఖ్యమైన పరిహారాలు:

శుక్రవారం రోజున పసుపు వస్త్రంలో పచ్చ కర్పూరం ఉంచి మూటకట్టి పూజ గదిలో పెట్టండి. ప్రతిరోజు దానికి అగర్‌బత్తీలు చూపించాలి. శుక్రవారం ధూపం వేయాలి. ఇలా చేస్తే భర్త సంపాదన పెరుగుతుంది. ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించాలి. ఆదివారం, శుక్రవారాల్లో గాజులు కొంటే మంచి జరుగుతుంది. మంగళవారం, శనివారం గాజులు కొంటే భర్త సంపాదన తగ్గుతుందని అంటారు. పూజ గదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోండి.

గమనిక: ఈ వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు దయచేసి గమనించగలరు. వీటిని ఎంతవరకు విశ్వసించాలి అనేది మీ వ్యక్తిగత నిర్ణయం.