Lord Worship: గణేశుడు, లక్ష్మి దేవిని కలిపి ఎందుకు పూజిస్తారో తెలుసా? ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

| Edited By: Ravi Kiran

Nov 22, 2021 | 10:45 AM

Lord Worship: శివపార్వతి తనయుడైన గణేషుడిని ఆరాధించకుండా ఏ పనిని ప్రారంభించరు. ఏ శుభ సందర్భంలోనైనా గణనాథుడిని ఆరాధిస్తారు. విఘ్నేశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు..

Lord Worship: గణేశుడు, లక్ష్మి దేవిని కలిపి ఎందుకు పూజిస్తారో తెలుసా? ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..
Lakshmi Goddess
Follow us on

Lord Worship: శివపార్వతి తనయుడైన గణేషుడిని ఆరాధించకుండా ఏ పనిని ప్రారంభించరు. ఏ శుభ సందర్భంలోనైనా గణనాథుడిని ఆరాధిస్తారు. విఘ్నేశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, ఆటంకాలను తొలగిస్తాడు అని ప్రగాఢ విశ్వాసం. ఒక వ్యక్తి ఎంత సంపదను కలిగి ఉన్నప్పటికీ, తెలివితేటలు లేకుంటే ఆ సంపదను ఎప్పటికీ సద్వినియోగం చేసుకోలేడు.

ఏ వ్యక్తి అయినా తెలివితేటలు, వివేకం కలిగి ఉండటం చాలా ముఖ్యం అనడానికి కారణం అదే. ఈ రెండు లక్షణాలు ఉన్న వ్యక్తి మాత్రమే డబ్బు అసలు ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలడు. అందుకే జ్ఞానం, సంపద కోసం గణేషుడు, లక్ష్మీ దేవి కలిపి పూజిస్తారు. ఒకవైపు గణేశుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తే, మరోవైపు లక్ష్మీ దేవి సంపదను కలిగిస్తుంది. గణేశుడిని, మాతా లక్ష్మిని కలిసి పూజించడం వలన కలిగే ప్రయోజనాలను అనేక గ్రంధాలు, పురాణాలు, వేద శాస్త్రాల్లో పేర్కొనడం జరిగింది. లక్ష్మీ దేవిని, గణపతిని కలిపి పూజించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి అహంకారాన్ని భగ్నం చేయాలని తలంచాడు..
శాస్త్రాల ప్రకారం.. లక్ష్మి దేవి సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొంటారు. అయితే, సంపద, శ్రేయస్సుకు కారణమం తానేనంటూ లక్ష్మీదేవిలో ఒకరకమైన గర్వం ఏర్పడుతుందట. దాంతో మహావిష్ణువు.. ఆ గర్వాన్ని తొలగించాలని భావిస్తాడు. అందులో భాగంగా ఓ మాట అంటాడు. ఏ స్త్రీ అయినా.. తల్లి అయ్యేంత వరకు సంపూర్ణ స్త్రీ కాదు అని లక్ష్మీ దేవికి చెబుతాడు. అయితే, లక్ష్మీ దేవికి సంతానం లేకపోవడంతో.. మహావిష్ణువు చెప్పిన మాటలు విని నిరాశకు గురవుతుంది. ఈ క్రమంలోనే తనకు సహాయం చేయాలంటే పార్వతి దేవి చెంతకు చేరుతుంది. పార్వతి దేవికి ఇద్దరు కుమారులు. కుమార స్వామి, గణేషుడు. లక్ష్మీ తన బాధను పార్వతి దేవికి వివరిస్తుంది. దాంతో లక్ష్మీ దేవి బాధను అర్థం చేసుకున్న పార్వతి దేవి.. తన కుమారులలో ఒకరిని దత్తత తీసుకునేందుకు అంగీకరిస్తుంది. అయితే, లక్ష్మీ దేవి ఒకే చోట ఎప్పుడూ ఉండదని తల్లి పార్వతికి తెలుసు. ఆ కారణంగా.. తన బిడ్డను సరిగా చూసుకుంటుందో లేదో అనే అనుమానం ఉండేది. అయితే, లక్ష్మీ దేవి బాధను అర్థం చేసుకుని.. తన కుమారుడు అయిన వినాయకుడిని లక్ష్మీ దేవికి దత్తత ఇచ్చింది.

అందుకే లక్ష్మీదేవిని పూజించే ముందు గణేశుడిని పూజిస్తారు..
అమ్మవారు పార్వతి దేవి కొడుకైన వినాయకుడిని దత్తత తీసుకోవడంతో లక్ష్మీ దేవి ఆనందపడింది. గణేశుడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని పార్వతి దేవికి మాట ఇచ్చింది. ఆ ప్రకారం.. ఎవరైనా, ఆనందం, శ్రేయస్సు, సంపద కోసం లక్ష్మీ దేవిని పూజించే వారు ముందుగా వినాయకుడిని పూజించవలసి ఉంటుంది. ఏదైనా శుభ కార్యం కోసం లక్ష్మీ దేవిని పూజించే ముందు గణేశుడిని పూజించిన తర్వాత మాత్రమే అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అప్పుడే అమ్మవారి సంతోషించి.. ఆ కుటుంబంలో సిరిసంపదలు కురిపిస్తుంది.

Also read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..