హిందువుల పూజ సమయంలో ఆహార నియమాలున్నాయి.. ఉల్లి, వెల్లుల్లిని తినడం ఎందుకు నిషేధించారో తెలుసా..

|

Jul 04, 2024 | 7:44 AM

హిందూ మతం ప్రకారం పూజ, శుభ కార్యాలు లేదా ఉపవాసం సమయంలో శాఖాహారం తప్పనిసరి. చేపలు, మాంసం, గుడ్లు మాత్రమే కాదు.. ఉల్లిపాయలు, వెల్లుల్లిని నిషేధించారు. ఉల్లి, వెల్లుల్లి ముఖ్యమైన ఆహార పదార్థాలు.. ఇవి మట్టిలో పెరిగినప్పటికీ శాఖాహారంలో నిషేధించబడ్డాయి. ఇవి హిందూ మతంలో తామసిక ఆహారంగా పరిగణించబడుతుంది.

హిందువుల పూజ సమయంలో ఆహార నియమాలున్నాయి.. ఉల్లి, వెల్లుల్లిని తినడం ఎందుకు నిషేధించారో తెలుసా..
Hindu Festival
Follow us on

ఆకలితో ఉన్న సమయంలో ఆహారం గురించి మాట్లాడినా లేదా ఆహారాన్ని చూసినా నోటిలో ఎక్కువ లాలాజలం ప్రవహిస్తుంది. ఇష్టమైన ఆహారం చూస్తే కడుపు మరింత మెలితిరుగుతుంది. కనుక ఉపవాసం ఉన్నప్పుడు ఇష్టమైన ఆహరం ఎక్కువగా గుర్తుకు వస్తుంది. ఆహారం తినడాన్ని అందరూ ఇష్టపడతారు. వస్తావనంగా చెప్పాలంటే ఖాళీ కడుపుతో ఏమీ చేయ్యలేం. ఏ పని చేసినా సక్సెస్ సాధించలేము. అలాగే ప్రకృతి కూడా.. కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా మాంసాహారాన్ని ఇష్టంగా తింటారు. ఇంకా చెప్పాలంటే మాంసాహారం తినకుండా చాలా మంది జీవించలేరు.

హిందూ మతం ప్రకారం పూజ, శుభ కార్యాలు లేదా ఉపవాసం సమయంలో శాఖాహారం తప్పనిసరి. చేపలు, మాంసం, గుడ్లు మాత్రమే కాదు.. ఉల్లిపాయలు, వెల్లుల్లిని నిషేధించారు. ఉల్లి, వెల్లుల్లి ముఖ్యమైన ఆహార పదార్థాలు.. ఇవి మట్టిలో పెరిగినప్పటికీ శాఖాహారంలో నిషేధించబడ్డాయి. ఇవి హిందూ మతంలో తామసిక ఆహారంగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మికతను విశ్వసించినా, నమ్మకపోయినా ఉపవాసం ఉన్నప్పుడు లేదా ఇంట్లో పవిత్రమైన శుభసందర్భంలో లేదా పూజలు జరుపుకునే సమయంలో లేదా యజ్ఞానికి హాజరైనప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి లేని సాత్విక (శాఖాహారం) తినడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. పండితులు లేదా పూజారులు వెల్లుల్లి, ఉల్లిపాయలను తినకూడదని సలహా ఇస్తారు. ఇలాంటి నియమం ఎందుకో తెలుసా..

ఆహారం మూడు భాగాలుగా విభజించబడింది

ఇవి కూడా చదవండి

పురాణ గ్రంథాల ప్రకారం ఆహారం మూడు భాగాలుగా విభజించబడింది. వీటిలో మొదటిది సాత్వికమైనది, రెండవది రాజసమైనది, మూడవది లేదా చివరిది తామసిక ఆహారం. పురాతన కాలంలో, భారతదేశంలోని వివిధ పురాణాలు లేదా గ్రంధాలు, “మీరు తిన్న ఆహారంలో మీ మనస్సు కూడా ఉంటుంది” అని ప్రస్తావిస్తుంది. అంటే మీరు తినే ఆహారం మీ జీవితం, మనస్సుపై ప్రభావం చూపుతుంది. ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఆహారంతో పాటు మానసిక స్థితి కూడా మారుతుంది.

సాత్విక ఆహారం

గరిష్ట సత్వగుణాన్ని కలిగి ఉండే ఆహారాన్ని సాత్విక ఆహారం అంటారు. ఆహారంలో పాలు, నెయ్యి, పిండి, పచ్చి కూరగాయలు, పండ్లు మొదలైనవి ఉంటాయి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

రాజస ఆహారం

చాలా మసాలా దినుసులు కలిగి ఉన్న ఆహారాలు. మాంసాహారం తయారుచేసేటప్పుడు మసాలా దినుసులు ఉపయోగిస్తారు. అందుకే అలాంటి ఆహారాన్ని రాజస ఆహారం అంటారు. వీటిలో కుంకుమపువ్వు, మిరపకాయలు, మసాలా దినుసులతో పాటు గుడ్లు, మాంసం, చేపలు వంటి మాంసాహార ఆహారాలు ఉన్నాయి.

తామసిక ఆహారం

మీ రక్త ప్రవాహాన్ని అధికం చేసే ఆహారాన్ని తినడం వలన కొన్నిసార్లు రక్త ప్రవాహం పెరుగుతూ.. మరి కొన్నిసార్లు తగ్గుతుంది, దీనిని తామసిక ఆహారం అంటారు. అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కోపం, గర్వం, టెన్షన్ వంటి భావాలు కలుగుతాయి. వెల్లుల్లి, ఉల్లిపాయలను ఈ వర్గంలో చేర్చారు. ఏ పూజ, ఉపవాసం లేదా మతపరమైన ఆచారాల సమయంలో రెండూ తీసుకోకూడదని పేర్కొన్నారు. ఎందుకంటే పూజ సమయంలో ప్రశాంతమైన మనస్సు , దయ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు