ఇంటిని అందంగా ఉంచుకోవడానికి చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ కొని పెంచుకుంటారు. వాస్తు ప్రకారం, ఇంటి లోపల పచ్చని మొక్కలను పెంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. అంతేకాదు అదృష్టాన్ని పెంచడంలో సహాయపడే వివిధ మొక్కలు వాస్తులో ఉన్నాయి. అందులో ఒకటి వెదురు మొక్క. చాలా మంది ఈ వెదురు మొక్కను తమ ఇళ్లలోనే కాకుండా ఆఫీసుల్లో కూడా పెంచుకుంటారు. ఎందుకంటే వెదురు మొక్క అదృష్టాన్ని కలిగిస్తుంది. అంతేకాదు డబ్బు సమస్యలను తొలగిస్తుంది. అయితే ఇంట్లో సరైన దిశలో వెదురు మొక్కను పెంచుకోవాలి. వెదురు మొక్కను తప్పు దిశలో పెంచినట్లయితే.. ఆ ప్రభావం ఇంటి ఆర్థిక స్థితిపై ప్రతికూలంగా ప్రభావితం చూపిస్తుంది. కనుక ఇంట్లో వెదురు మొక్కను ఏ దిశలో పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్క అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది. వెదురు మొక్క సానుకూల శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. గృహ ఆదాయాన్ని పెంచుతుంది. ఇంటికి సంపద, శ్రేయస్సు తెస్తుంది. అంతేకాకుండా ఈ మొక్క మనస్సు , ఆత్మకు శాంతిని కలిగిస్తుంది.
వాస్తు ప్రకారం ఇంట్లో లేదా ఆఫీసులో వెదురు మొక్కను పెంచడం శుభపరిణామంగా పరిగణించబడుతుంది. ఇది వెదురు మొక్కలోని కొమ్మలపై ఆధారపడి ఉంటుంది. అంటే 11 కొమ్మలున్న వెదురును నాటడం మంచిది. 2 కొమ్మలు ప్రేమ .. వైవాహిక జీవితానికి, 3 కొమ్మలు సంతోషకరమైన జీవితానికి, 5 కొమ్మలు ఆరోగ్యానికి, 10 కొమ్మలు పరిపూర్ణ జీవితానికి.. 21 కొమ్మలు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి శుభప్రదంగా భావిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)