Vastu Tips: ఇంట్లో లేదా ఆఫీసులో అందం కోసం పెయింటింగ్స్ ను వేసుకోవడం లేదా… కొన్ని చిత్ర పటాలను ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఇలా చేయడం వలన కొన్నిసార్లు ప్రజలు జీవితంలో సుఖ శాంతులతో పాటు సంపద పొందడానికి కారణమవుతాయి. అలాంటి కొన్ని పెయింటింగ్‌ల ప్రాముఖ్యత వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇవి జీవితంలో శుభాన్ని కలిగిస్తాయి. వీటిలో ఒకటి 7 గుర్రాల పెయింటింగ్ . దీనికి వాస్తులో ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. గుర్రాలు పెరుగుదల, బలం, ధైర్యం , విధేయతకు చిహ్నంగా పరిగణించబడతాయి. జీవితంలో సానుకూల వేగాన్ని తీసుకుని వస్తాయి. అదే సమయంలో, సంఖ్య 7 శుభప్రదంగా పరిగణించబడుతుంది. కనుక అలాంటి పెయింటింగ్‌లు మంచివిగా పరిగణిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించబోయే వారు తమ కార్యాలయంలో కూడా ఈ పెయింటింగ్‌ను ఏర్పటు చేసుకోవడం మేలు చేస్తుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే దీనిని ఏర్పాటు చేసుకునే ముందు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. ప్రజలు ఇంట్లో ఈ గుర్రాల పెయింటింగ్ ను ఏర్పాటు చేసుకునే ముందు వాస్తు ప్రకారం ఈ తప్పులు చేస్తారు. అయితే ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో.. ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం..
పెయింటింగ్ వేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు:
1. ఏడు గుర్రాల పెయింటింగ్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆనందం సంపదను సొంతం చేసుకోవచ్చు. ఆర్ధిక ప్రయోజనాలు కోరుకునే వారు ఈ పెయింటింగ్ ను తమ కార్యాలయంలో కూడా ఉంచుకోవచ్చు. చాలా సార్లు ప్రజలు ఈ పెయింటింగ్‌ను ఆఫీసు బయట ఉంచుతారు, అయితే ఇలా చేయకూడదు.
2. పెయింటింగ్‌లో గుర్రాల స్థానం అవి సరళ రేఖలో ఉండేలా లేదా సమానంగా నడుస్తున్నట్లు కనిపించాలి.
3. చాలా సార్లు ప్రజలు 7 గుర్రాల చిత్రలేఖనాన్ని తీసుకువస్తారు. అందులో వారి అసంపూర్ణ చిత్రం కనిపిస్తుంది. ఈ పొరపాటు మీ ఇంట్లో వివాదాలు, పేదరికాన్ని కలిగిస్తుంది. గుర్రాలు స్ఫష్టంగా కనిపించేలా చిత్రం ఉండాలి.
4. పెయింటింగ్ పరిమాణం విషయంలో ప్రజలు తరచుగా తప్పులు చేస్తుంటారు. కొంతమంది ఇల్లు చాలా పెద్దది.. అయితే ఈ పెయింటింగ్ ను చిన్నగా ఉంచుతారు. మీరు ఇంట్లో ఉంచబోయే 7 గుర్రాల చిత్రం గది పరిమాణం ప్రకారం ఉండేలా ప్రయత్నించండి.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఇచ్చింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..