Basara: బాసరలో వసంత పంచమి వేడుకలు.. సుప్రభాత సేవలతో ప్రారంభమైన ఉత్సవాలు

|

Jan 26, 2023 | 7:17 AM

చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలు బాసరలో ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే అక్షరాభ్యాస కార్యక్రమం మొదలుపెట్టారు.

Basara: బాసరలో వసంత పంచమి వేడుకలు.. సుప్రభాత సేవలతో ప్రారంభమైన ఉత్సవాలు
Vasantha Panchami
Follow us on

బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ వసంత పంచమి సందర్భంగా సరస్వతీ అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఐకే రెడ్డి స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించడానికి వేలాదిగా తరలి వచ్చారు. ఇందు కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేకంగా క్యూలైన్లు, అక్షరాభ్యాస టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.బాసర ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఆలయ గోపురాలు, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

అమ్మవారికి ఈ ఏడాది ప్రత్యేక చీర సమర్పణ

ఈ సారి వసంతపంచమి ఉత్సవాలకు ఒక ప్రత్యేకత నెలకొంది. స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి మగ్గాలను బాసరకు తీసుకు వచ్చి ప్రత్యేకంగా చీరలను సిద్ధం చేశారు. ఆ చీరలనే గురువారం వసంత పంచమి పర్వదినాన అమ్మవారిని అలంకరించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం