Uthana Ekadashi 2024: ఉత్థాన ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి.. ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది..

|

Nov 07, 2024 | 9:48 AM

ప్రతి నెల కృష్ణమ, శుక్ల పక్ష ఏకాదశి తిథి రోజున ఉపవాసం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈసారి కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఉత్థాన ఏకాదశి వ్రతం నవంబర్ 12న ఆచరించనున్నారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల సర్వపాపాలు నశిస్తాయనే నమ్మకం ఉంది. ఎవరైనా డబ్బులకు ఇబ్బంది పడుతుంటే ఉత్థాన ఏకాదశి రోజున కొన్ని వస్తువులను దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

Uthana Ekadashi 2024: ఉత్థాన ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి.. ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది..
Uthana Ekadashi 2024
Follow us on

హిందూ మతంలో ఉత్థాన ఏకాదశిని లేదా ప్రబోధిని ఏకాదశి ఉపవాసం చాలా పవిత్రమైనది. ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎందుకంటే ఈ రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. దీంతో 4 నెలల తర్వాత నుంచి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభ కార్యాలు ప్రారంభమవుతాయి. ఉత్థాన ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఉపవాసం పాటిస్తారు. వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఉత్థాన ఏకాదశి నవంబర్ 12 న వచ్చింది. ఉత్థాన ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు.

ఉత్థాన ఏకాదశి నుండి వివాహాలు ప్రారంభమవుతాయి. మర్నాడు అంటే ద్వాదశి రోజున తులసి వివాహాన్ని జరిపిస్తారు. ఉత్థాన ఏకాదశి రోజున చేసే దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున దానధర్మాలు, పుణ్యకార్యాలు చేసేవారి ఇంట్లో ధన, ధాన్యాలకు లోటుండదని, సుఖ సంతోషాలకు, ఐశ్వర్యానికి లోటుండదని నమ్మకం. అటువంటి పరిస్థితిలో ఉత్థాన ఏకాదశి రోజున ఏమి దానం చేయాలో తెలుసుకుందాం..

ఉత్థాన ఏకాదశి 2024 శుభ సమయం

హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిధి నవంబర్ 11 సాయంత్రం 6.46 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తిధి నవంబర్ 12 సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉత్థాన ఏకాదశి ఉపవాసం నవంబర్ 12 న చేయనున్నారు. ఉత్థాన ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు పారణ సమయం ప్రకారం పారణ చేయాలి. ఎందుకంటే పారణానంతరం మాత్రమే ఉపవాసం పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

ఇవి కూడా చదవండి

ఉత్థాన ఏకాదశి నాడు చేయాల్సిన దానాలు

హిందూ మత విశ్వాసం ప్రకారం ఉత్థాన ఏకాదశి రోజున ఉపవాసం ఉండడమే కాదు చేసే దానాలతో విష్ణువు ప్రసన్నుడవుతాడు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేకపోయినా దానం చేయండం మంచింది. ఉత్థాన ఏకాదశి వ్రతాన్ని విరమించిన తర్వాత బ్రాహ్మణుడికి దక్షిణ ఇస్తారు. అంతే కాదు ఈ రోజున అన్నదానం చేయడం శుభప్రదం.

ఉత్థాన ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, మినుము, ఉసిరి, బెల్లం దానం చేయడం చాలా శ్రేయస్కరం. అంతే కాదు ఈ రోజున వస్త్రదానం కూడా చేస్తారు. ఉత్థాన ఏకాదశి రోజున పసుపు బట్టలు దానం చేయవచ్చు. ఈ ఏకాదశి రోజున బత్తాయి, చెరకు, అరటి పండ్లు ఇలా అన్ని కాలానుగుణ పండ్లను దానం చేయడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ వస్తువులను దానం చేయడం ద్వారా శ్రీ మహా విష్ణువు సంతోషిస్తాడు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.

దానం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఉత్థాన ఏకాదశి రోజున మురళి, పసుపు, నెమలి ఈకలు, శంఖం మొదలైన వాటిని దానం చేయడం శుభప్రదం. ఉత్థాన ఏకాదశి రోజున దానం చేసే సమయంలో తాము చేసే దానం గురించి ఎవరికీ చెప్పవద్దని గుర్తుంచుకోండి. ఎందుకంటే దానాలను వీలైనంత రహస్యంగా చేయాలి. దీనినే కుడి చేతితో చేసే దానం.. ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని పెద్దలు చెప్పారు. అదే సమయంలో ఈ పవిత్రమైన రోజున ఈ వస్తువులన్నింటినీ దానం చేస్తే.. ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. జీవితంలో దేనికీ లోటు ఉండదు.

 

 మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.