
దురదృష్టం వెన్నాడుతున్నప్పుడు లేదా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నప్పుడు నెమలి ఈక ఒక అద్భుతమైన నివారణిగా పనిచేస్తుంది. వివిధ గ్రహాల అనుగ్రహం పొందడానికి నెమలి ఈకలను ఏ రోజున, ఎలా వాడాలో నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాహు-కేతువుల ప్రభావం వల్ల వచ్చే అడ్డంకులను తొలగించుకోవడానికి ఇది ఒక రామబాణంలా పనిచేస్తుంది. పిల్లల చదువు నుండి వైవాహిక జీవితం వరకు నెమలి ఈకతో పొందే ప్రయోజనాలు దానిని ఏ దిశలో ఉంచాలో తెలుసుకోండి.
గ్రహ దోషాల నివారణకు పరిహారాలు:
కుజ దోషం: మంగళవారం నాడు ఏడు నెమలి ఈకలను ఎర్రటి దారంతో కట్టి, ఏడు తమలపాకులతో ఉంచి ప్రత్యేక మంత్రాలతో పూజిస్తే కుజ దోషం తొలగిపోతుంది.
బుధ గ్రహం: తెలివితేటలు పెరగడానికి బుధవారం నాడు ఆరు నెమలి ఈకలను ఆకుపచ్చ దారంతో కట్టి పూజించాలి.
గురు, శుక్ర గ్రహాలు: ఆర్థికాభివృద్ధి కోసం గురువారం ఐదు నెమలి ఈకలను పసుపు దారంతో, వైవాహిక సుఖం కోసం శుక్రవారం నాలుగు నెమలి ఈకలను గులాబీ దారంతో కట్టి పూజించాలి.
రాహు-కేతువులు: శనివారం నాడు రెండు నెమలి ఈకలను గోధుమ లేదా బూడిద రంగు దారంతో కట్టి పూజిస్తే జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి.
వాస్తు, ఇతర ప్రయోజనాలు:
ఇంటి ఆగ్నేయ దిశలో నెమలి ఈకను ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా దేవుడి గదిలో వీటిని ఉంచడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. పిల్లలు చదువుకునే గదిలో లేదా పుస్తకాల మధ్య నెమలి ఈకను ఉంచితే వారి ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
బెడ్ రూమ్ లో ఉంచవచ్చా?
బెడ్ రూమ్ లో నెమలి ఈకను ఉంచుకోవడం వల్ల దంపతుల మధ్య అపార్థాలు తొలగిపోయి అనురాగం పెరుగుతుంది. ఒకవేళ మీకు రాత్రిపూట భయంకరమైన కలలు వస్తుంటే, దిండు కింద నెమలి ఈకను పెట్టుకుని నిద్రపోవడం వల్ల రాహు-కేతువుల అశుభ ప్రభావం తగ్గి మనశ్శాంతి లభిస్తుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. ఈ వివరాలు జ్యోతిష్య శాస్త్ర నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయి, దీనికి శాస్త్రీయ ఆధారం లేదు. దీనికి సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం. సంస్థ దీనికి బాధ్యత వహించదు.