Chhattisgarh: ఈ ఆలయంలో వింత సంప్రదాయం.. పిల్లలు పుడితే గోరింటాకు, కర్రపెండలం అమ్మవారికి నైవేద్యం..

భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలు ప్రత్యేక సంప్రదాయాలు, నమ్మకాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్‌లో ఉన్న శతన్ దేవి ఆలయం అలాంటి వాటిలో ఒకటి. ఈ ఆలయానికి సంబంధించి అనేక విశిష్ట నమ్మకాలు ఉన్నాయి. వాటిపై ప్రజలు అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నారు.

Chhattisgarh: ఈ ఆలయంలో వింత సంప్రదాయం.. పిల్లలు పుడితే గోరింటాకు, కర్రపెండలం అమ్మవారికి నైవేద్యం..
Shatan Devi Temple

Updated on: Nov 26, 2024 | 8:12 AM

ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్‌లో ఉన్న శతన్ దేవి ఆలయం ఒక ప్రసిద్ధ చెందిన చారిత్రక, మతపరమైన ప్రదేశం. ఈ ఆలయం భక్తులను ఆకర్షిస్తుంది. ఈ దేవాలయంపై ప్రజలకు ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం రతన్‌పూర్ కోట సమీపంలో ఉంది. శక్తి ఆరాధనకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మాతా శతన్ దేవికి (శక్తి రూపం) అంకితం చేయబడింది. ఈ దేవాలయం ప్రత్యేకమైన సంప్రదాయాలు, నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది. స్థానికులు ఈ ఆలయాన్ని ‘పిల్లల దేవాలయం’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం వలన సంతానం లేనివారికి అమ్మవారి కృపతో సంతానం కలుగుతుందని ప్రతీతి.

ఈ ఆలయం ప్రత్యేకమైన సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది

ఈ దేవాలయం విశిష్టమైన సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. చాలా దేవాలయాలలో స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు, కొబ్బరి కాయ వంటివి దేవుళ్ళకు ప్రసాదంగా సమర్పిస్తే.. ఈ ఆలయంలో గోరింటాకు, కర్రల పెండలాన్ని ప్రసాదంగా లేదా నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ ఆలయం “చిల్డ్రన్స్ టెంపుల్” పేరుతో ప్రసిద్ధి చెందింది. దీనికి చాలా ఆసక్తికరమైన కారణం ఉంది. ఈ ఆలయంలో తల్లి శతన్ దేవి అనుగ్రహంతో సంతానం లేని వారు సంతానం పొంది ఆనందాన్ని పొందుతారని ప్రతీతి. కోరికలు నెరవేరి, బిడ్డ జన్మించిన తరువాత ప్రజలు తిరిగి ఇక్కడికి వచ్చి గుడిలో గోరింటాకు, కర్ర పెండలంను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శతాన్ దేవి తమ పిల్లలకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని అచంచలమైన నమ్మకం కలిగి ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కోరికలు నెరవేరుతాయి

ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని మాతా శతన్ దేవి ఆలయం గురించి ఒక నమ్మకం కూడా ఉంది. కోరికలు చెప్పుకుని అవి నేరవేర్చమని అమ్మవారిని పూజించడానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. అందుకే ఈ ఆలయాన్ని కోరికల దేవాలయం అని కూడా అంటారు. తమ పిల్లలకు దీర్ఘాయుస్సుని, ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థిస్తారు.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.