Ugadi Tirumala: తెలుగు నూతన సంవత్సర(Telugu New Year) ఉగాదిని పురష్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు శుభకృత్ నామ(ShubhaKruth Nama) సంవత్సర ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం సేవను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు.
ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విశ్వక్‌సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు.7గంటల నుండి 9గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు,ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. తర్వాత ఆలయంలో పంచాగ శ్రవణం నిర్వహిస్తారు.
ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఉగాది పండువని పురష్కరించుకుని శీవారి ఆలయంలో నిర్వహించే అర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.
Read Also: