Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ రోజు స్వామివారి అక్టోబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా రిలీజ్.. పూర్తి వివరాలివే..

|

Jul 18, 2024 | 7:31 AM

ఈ రోజు (జూలై 18న) అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటాను రిలీజ్ చేయనుంది. స్వామివారి శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టిటిడీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ నెలకు సంబందించిన దర్శన కోటా రిలీజ్ తేదీలు, సమయాలు పూర్తి వివరాలు మీ కోసం

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ రోజు స్వామివారి అక్టోబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా రిలీజ్.. పూర్తి వివరాలివే..
Tirumala Tirupati
Follow us on

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్ళాలని.. స్వామివారిని దర్శించుకుని వడ్డీకాసుల వాడికి తమ మొక్కులు చెల్లించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. ఈ నేపధ్యంలో స్వామివారి దర్శనం భక్తులకు సులభంగా అయ్యే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా స్వామివారి దర్శనానికి సంబంధించిన పలు రకాల టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతుంది. ఈ రోజు (జూలై 18న) అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటాను రిలీజ్ చేయనుంది. స్వామివారి శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టిటిడీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ నెలకు సంబందించిన దర్శన కోటా రిలీజ్ తేదీలు, సమయాలు పూర్తి వివరాలు మీ కోసం

అక్టోబరు నెలకు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు ఈ రోజు ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవాటికెట్లు భక్తులకు లక్కి డిప్ ద్వారా అందించబడతాయి. ఈ నేపధ్యంలో ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

లక్కి డిప్ లో స్వామివారి ఆర్జిత సేవా టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

జూలై 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు స్వామి వారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

జూలై 22 వ తేదీన వర్చువల్ సేవల కోటా విడుదల ను రిలీజ్ చేయనుండగా.. వర్చువల్ సేవ దర్శన స్లాట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

అక్టోబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

జూలై 23న మధ్యాహ్నం 3 గంటల సమయంలో వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను రిలీజ్ చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యెక దర్శన టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

అక్టోబరు నెల‌కు సంబంధించిన స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

అక్టోబర్ నెలలో స్వామివారి దర్శనార్ధం వెళ్లాలనుకునే భక్తుల కోసం తిరుమల, తిరుపతిల‌లో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

అంతేకాదు స్వామివారికి సేవలను చేయాలనుకునే భక్తుల కోసం వివిధ సేవలను జూలై 27న వివిధ సమయాల్లో రిలీజ్ చేయనుంది. తిరుమ‌ల, తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..