Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేడు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. 10గంటల నుంచి రిజిస్ట్రేషన్

ఈ మేరకు ఆర్జిత సేవా లక్కీ డిప్ టిక్కెట్లు ఈనెల 8వ తేదీ ఉదయం 10 గంటలనుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనని టీటీడీ పేర్కొంది. అనంతరం ఈ టికెట్లను ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయించనున్నారు.  

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేడు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. 10గంటల నుంచి రిజిస్ట్రేషన్
Tirumala Temple

Updated on: Feb 08, 2023 | 8:37 AM

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ.. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను రిలీజ్ చేయనుంది.  ఫిబ్రవరి నెలలోని 22వ తేదీ నుంచి 28వ తేదీ కి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.  ఈ ఆర్జిత సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయించనున్నారు. ఈ మేరకు ఆర్జిత సేవా లక్కీ డిప్ టిక్కెట్లు ఈనెల 8వ తేదీ ఉదయం 10 గంటలనుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనని టీటీడీ పేర్కొంది. అనంతరం ఈ టికెట్లను ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయించనున్నారు.

రేపు వర్చువల్ సేవల దర్శన కోటా విడుదల:

క‌ల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను రేపు ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నారు.  ఈ నెల 22 నుండి 28వ తేది వరకు వర్చువల్ సేవా దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది టీటీడీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us