Tirumala Hundi Collection: శ్రీవారి హుండీకి నిధుల వరద.. ఒక్క జూలై నెలలోనే అత్యధికంగా..

కలియుగ ప్రత్యక్షదైవం ఆ శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం వచ్చే భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. దాంతో వడ్డీకాసులవాడి ఖజానాకు కాసుల వరద కొనసాగుతోంది..

Tirumala Hundi Collection: శ్రీవారి హుండీకి నిధుల వరద.. ఒక్క జూలై నెలలోనే అత్యధికంగా..
Ttd

Updated on: Aug 01, 2022 | 11:18 AM

Tirumala Hundi Collection: శ్రీవారి హుండీకి నిధుల వరద.. ఒక్క జూలై నెలలో అత్యధిక ఆదాయం
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం కురుస్తోంది. స్వామివారి హుండీ ఆదాయం ఏ నెలకు ఆ నెల రికార్డులు సృష్టిస్తోంది. కలియుగ ప్రత్యక్షదైవం ఆ శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం వచ్చే భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. దాంతో వడ్డీకాసులవాడి ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతోంది. తాజాగా జూలై నెలలో శ్రీవారి హుండి ఆదాయం అత్యధికంగా నమోదు అయింది. టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వామివారికి 139.45 కోట్ల హుండి ఆదాయం వచ్చి చేరింది. దీంతో వరుసగా ఐదో నెల 100 కోట్లు దాటి శ్రీవారి హుండి ఆదాయం నమోదు అయింది.

ఈ ఏడాది మార్చి నెలలో 128 కోట్లు, ఏప్రిల్ మాసంలో 127.5 కోట్లు, మే నెలలో 130.5 కోట్లు, జూన్ లో 123.76 కోట్ల రూపాయలు హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం లభించగా, జూలై మాసంలో హుండీ ద్వారా ఏకంగా 139.45 కోట్ల ఆదాయం లభించింది. చివరి నాలుగు మాసాల్లో 649.21 కోట్ల రూపాయలు స్వామి వారికి కానుకలు అందాయి. వరుసగా ఐదో నెల 100 కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటింది. జూలై నెలలోనే ఐదుసార్లు 5 కోట్ల రూపాయల మార్క్ ని హుండీ ఆదాయం చేరగా, జూలై 4వ తేదీన స్వామి వారికి 6.18 కోట్ల హుండీ ఆదాయం లభించింది. ఒక్క రోజులో ఎక్కువ ఆదాయం నమోదైంది జూలై 4వ తేదీన కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us