TTD: టీటీడీ కీలక ప్రకటన.. ఇక ఆఫ్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టోకెన్లు.. ఎప్పటి నుంచంటే..

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం..

TTD: టీటీడీ కీలక ప్రకటన.. ఇక ఆఫ్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టోకెన్లు.. ఎప్పటి నుంచంటే..
Ttd Yv Subbareddy

Updated on: Jan 28, 2022 | 7:35 PM

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ప్రకటించారు. కోవిడ్ కారణంగా ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని విధిలేని పరిస్థితిలో ఆన్ లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబరు 25 వ తేదీ నుంచి రద్దు చేశామని ఛైర్మన్ వివరించారు. ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్న భావనలో టీటీడీ ఉందన్నారు.

సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్ లైన్ విధానం లో సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని అనేక సార్లు భావించినా.. కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేయక తప్పడం లేదని  సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నందు వల్ల వారి సూచన మేరకు ప్రస్తుతం ఆన్ లైన్‌లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఫిబ్రవరి 15వ తేదీ కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే అంశం పై నిర్ణయం తీసుకుంటామని చైర్మన్  సుబ్బారెడ్డి భక్తులకు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి: Viral Video: స్నేహం అంటే ఇదే రా.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన ఫ్రెండ్‌ను రక్షించిన కుక్క..

Viral Video: ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా..? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం..

Loading...
Unable to load recommendations.
Follow Us