Kashi Tour: వారణాసికి వెళ్తున్నారా.. విశ్వనాథుడి దర్శనంతో పాటు.. ఈ 5 పనులు చేయండి.. లేదంటే మీ పర్యటన ప్రయాణం అసంపూర్ణం

Kashi Vishwanath Temple: కాశీ భారతదేశపు(Bharath) అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో(Dwadasa Jyothirlinga) ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ భక్తులతో..

Kashi Tour: వారణాసికి వెళ్తున్నారా.. విశ్వనాథుడి దర్శనంతో పాటు.. ఈ 5 పనులు చేయండి.. లేదంటే మీ పర్యటన ప్రయాణం అసంపూర్ణం
Varanasi Tour

Updated on: May 07, 2022 | 9:55 AM

Kashi Vishwanath Temple: కాశీ భారతదేశపు(Bharath) అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో(Dwadasa Jyothirlinga) ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ భక్తులతో పూజలను అందుకుంటుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. విశ్వనాథుడు అంటే ప్రపంచానికి అధిపతి అని అర్థం. కాశీ విశ్వనాథుని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వారణాసికి వస్తుంటారు. మీరు వారణాసికి కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి వెళుతున్నట్లయితే, అక్కడ ఈ 5 పనులు చేయండి.. లేకపోతే మీ కాశీ ప్రయాణం అసంపూర్తిగా మిగిలిపోతుంది.

సందర్శించాల్సిన దేవాలయాలు: వారణాసి ఒక పుణ్యక్షేత్రం. ముఖ్యంగా విశ్వనాథుని దర్శించుకోవడానికి భక్తులు ఈ క్షేత్రానికి వెళ్లారు. అవిశాలాక్షి ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కడు – ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాల నిర్మాణం.. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తాయి.

గంగా నది తీరంపై పడవ ప్రయాణం: కాశీ విశ్వనాథుడి దర్శనంతో పాటు .. గంగానదిలో బోటింగ్ ను ఆనందించండి. ఉదయం గంగా నదిలో పడవలో విహరించండి. ప్రకృతి అందం మనసుని మైమరిపిస్తోంది.

గంగా హారతి: సాయంత్రం వారణాసిలో గంగా హారతి నిర్వహిస్తారు. వారణాసిని సందర్శించి.. ఆరతిని చూడకుండా తిరుగు ప్రయాణం అయితే మీ ప్రయాణం అసంపూర్ణమే. గంగా హారతి చాలా గ్రాండ్‌గా ఉంటుంది. హారతి దర్శనం ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. దశవమేధ ఘాట్ వద్ద ఆరతి కార్యక్రమం జరుగుతుంది.

స్ట్రీట్ ఫుడ్: ఎక్కడికైనా వెళితే స్థానికంగా ఉండే ఆహారపదార్ధాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అన్ని ప్రాంతాల మాదిరిగానే వారణాసిలో దొరికే ఆహారానికి కూడా ప్రత్యేకత ఉంది. వారణాసిలో స్ట్రీట్ ఫుడ్ ని ఆస్వాదించండి. స్ట్రీట్ ఫుడ్‌లో,  కచోరి సబ్జీ, బటర్ మసాలా వంటి ఆహారపదార్ధాలను రుచి చూడవచ్చు. అంతేకాదు.. బనారసీ పాన్ తినడం మర్చిపోవద్దు.

బనారసీ చీరలు: బనారసీ చీరలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. ఇప్పుడు మళ్లీ ఈ చీరలు ట్రెండ్‌ వచ్చింది. బనారసీ చీరలు, బనారసీ సూట్‌లను కొనుగోలు చేయండి. సరసమైన ధరలలోలభ్యమవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Tirumala: వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి వారపు సేవలకు తాత్కాలికంగా బ్రేక్..

Nayanthara-Vignesh: నయన్ విగ్నేష్‌ల పెళ్లి డేట్ ఫిక్స్?.. తిరుమలలో పెళ్లి పీటలు ఎక్కనున్న జంట..