Toli Ekadashi: తొలి ఏకాదశికి మహానంది క్షేత్రంలో అద్భుతం.. శివయ్య భక్తులకు నాగుపాము దర్శనం..

|

Jun 29, 2023 | 10:17 AM

తొలిఏకాదశి ఈ రోజు శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు ఆరాధిస్తారు. ఉపవాసదీక్ష చేస్తారు. ఈ పర్వదినాన నంద్యాలలోని మహానంది క్షేత్రంలో అద్భుతం చోటుచేసుకుంది. శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన తొలిఏకాదశి రోజున పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించారు.

Toli Ekadashi: తొలి ఏకాదశికి మహానంది క్షేత్రంలో అద్భుతం.. శివయ్య భక్తులకు నాగుపాము దర్శనం..
Snake In Mahanandi Temple
Follow us on

ఆషాఢమాస తొలి ఏకాదశి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విష్ణు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తొలి ఏకాదశినే శయన ఏకాదశి, మతత్రయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురానవచనం. శ్రీ మహావిష్ణువుకు ఏకాదశి తిథి అంటే ఎంతో ప్రీతి. అందుకే భక్తులంతా ఈ రోజు శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఉపవాసదీక్ష చేస్తారు. ఈ పర్వదినాన నంద్యాలలోని మహానంది క్షేత్రంలో అద్భుతం చోటుచేసుకుంది. శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన తొలిఏకాదశి రోజున పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించారు.

మహానంది క్షేత్రంలోని రుద్రగుండం కోనేరు వద్ద ఓ పెద్ద నాగుపాము దర్శనమిచ్చింది. కోనేరు వద్ద నాగుపామును గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. ఏకాదశి ఘడియల్లో శ్రీ మహావిష్ణువుతో పాటు పరమేశ్వరుడి దర్శనం కూడా జరిగిందంటూ భక్తులు నాగుపామును చూసేందుకు పోటీపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ నాగుపామును బంధించి భద్రంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..