Tirupati: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా శ్రీవారి ప్రణయ కలహోత్సవం..

|

Jan 19, 2022 | 9:12 AM

Tirupati: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి (Tirumala Tirupati) లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుమల(Tirupati ) శ్రీవారి..

Tirupati: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా శ్రీవారి ప్రణయ కలహోత్సవం..
Tirumala
Follow us on

Tirupati: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి (Tirumala Tirupati) లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుమల(Tirupati ) శ్రీవారి ఆలయంలో మంగ‌ళ‌వారం ప్రణయ కలహోత్సవం వేడుకగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు.. అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా ఈ ప్రణయ కలహోత్సవం కరోనా నిబంధనల నడుమ నిర్వహించారు.

ప్రణయ కలహోత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లతో స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందా… స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read:

 ఈ మూడు విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఎంతటి శత్రువైనా మోకరిళ్లాల్సిందే..