Tirumala: తిరుమల ఆలయంలో భక్తులు స్వామివారి దర్శనానికి ముందు వెండి వాకిలిలో అడుగు.. దీని అర్ధం ఏమిటో తెలుసా..

|

Apr 15, 2022 | 2:48 PM

Tirumala: ప్రతి హిందువు తప్పనిసరిగా చూడాలనుకునే క్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati). ఏడుకొండలమీద కొలువైన వెంకన్న ఆలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్న చందంగా ఉంటుంది..

Tirumala: తిరుమల ఆలయంలో భక్తులు స్వామివారి దర్శనానికి ముందు వెండి వాకిలిలో అడుగు.. దీని అర్ధం ఏమిటో తెలుసా..
Tirupati Temple Vendi Vakil
Follow us on

Tirumala: ప్రతి హిందువు తప్పనిసరిగా చూడాలనుకునే క్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati). ఏడుకొండలమీద కొలువైన వెంకన్న ఆలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్న చందంగా ఉంటుంది. అయితే తిరుమల తిరుపతి ఆలయంలో ఎన్నో సంప్రదాయాలు, వాటి వెనుక అనేక పుట్టుపూర్వోత్తరాలు.. దీని వెనుక చరిత్ర ఉంది. ఈ క్షేత్రంలో స్వామివారి విగ్రహం, జరిగే పూజలు, ఆలయం మీద చిత్రాలు అన్నీ విచిత్రాలే.. శ్రీకృష్ణ దేవరాయలు (Sri Krishna devaraya) , మైసూర్ మహారాజుల దగ్గరనుంచి ఎక్కడో ఢిల్లీలో ఉన్న సుల్తాన్ అక్బర్ దగ్గర మంత్రి రాజా తొందర మల్ విగ్రహం కూడా తిరుమల ఆలయంలో కనిపిస్తుంది. అయితే అనేక మంది తిరుమల క్షేత్రాన్ని దర్శించుకుంటూనే ఉన్నారు.. మరి తిరుమల కొండ పేర్లు.. వెండి వాకిలి, శ్రీవారి ఆలయంలో సరుకులనుని నిల్వ చేసే ప్రాంతాన్ని ఏమంటారు ఇలాంటి వివరాలు మీకు తెలుసా..!

శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో  ఏడుకొండలను కలిపి శేషాచలం కొండలంటారు. ఏడుకొండల పేర్లు శేషాద్రి, గురుడాద్రి, అంజనాద్రి, వృషాభాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఇక దేవాలయంలో శ్రీవారి ప్రసాదానికి కావాల్సిన ఆహారపదార్ధాలను నిల్వ చేసేందుకు ఒక స్పెషల్ గిడ్డంగి ఉంది. దీనిని ఉగ్రాణం అని కూడా అంటారు. ఇక్కడే దేవాలయానికి, ప్రసాదాలకు అవసరమయిన సరుకులన్నింటిని నిల్వచేస్తారు. ఇక్కడి నుంచి సరుకులు పోటు (వంటశాల) కు వెళతాయి.

శ్రీవారి ఆలయంలో ఉండే వెండివాకిలిని నడిమి కావాలి అని కూడా అంటారు. ఇక్కడే మహంత్ బాబాజీతో శ్రీ  వెంకటేశ్వర స్వామి పాచికలాడినట్లు పురాణాల కథనం. అందుకు సంబంధించిన చిత్రాలు ఈ వెండి వాకిలి మీద దశావతారాల బొమ్మలుంటాయి. భక్తులు వెండివంటి స్వచ్ఛమయిన మనసుతో ఆలయంలోకి ప్రవేశించాలనేందుకు వెండివాకిలి సూచన.

Also Read:

: బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి కొత్త సినిమా టైటిల్‌ ఖరారు.. స్వచ్ఛమైన ప్రేమ కథతో..

గుజరాత్‌ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో కుత కుతలు.. ఆప్‌లోకి దూకేందుకు కీలక నేతలు రెడీ..