Tirumala: శ్రీవారి భక్తులు బీ అలెర్ట్.. సర్వదర్శనం కోసం ఎన్ని గంటలు పడుతుందో తెలిస్తే షాక్..

|

Feb 20, 2022 | 7:43 PM

Tirumala: శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి(Turupati)కి వెళ్లే భక్తులకు అలెర్ట్.. స్వామి వారి సర్వదర్శనం (Sarvadarshanam) కోసం ఎదురుచూసే భక్తుల కోసం టీటీడీ(TTD) కీలక ప్రకటన..

Tirumala: శ్రీవారి భక్తులు బీ అలెర్ట్.. సర్వదర్శనం కోసం ఎన్ని గంటలు పడుతుందో తెలిస్తే షాక్..
Tirumala Pti 1640594654
Follow us on

Tirumala: శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి(Turupati)కి వెళ్లే భక్తులకు అలెర్ట్.. స్వామి వారి సర్వదర్శనం(Sarvadarshanam) కోసం ఎదురుచూసే భక్తుల కోసం టీటీడీ(TTD) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సర్వదర్శనం టోకెన్లు కోసం వచ్చే భక్తులకు మూడు లేదా నాలుగు రోజులు సమయం పడుతోందని భక్తులకు టీటీడీ తెలిపింది.  కరోనా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో కొన్ని నిబంధనల నడుమ ఈ నెల 16 నుంచి ఆఫ్ లైన్ లో టోకెన్లు జారీ చేస్తూ సర్వదర్శనానికి భక్తులకు అనుమతినిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతి లో ఆఫ్ లైన్ ద్వారా రోజుకు 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే 20వ తేదీ  ఆదివారం సర్వదర్శన టోకెన్ పొందిన భక్తులకు ఈ నెల 24వ తేదీ దర్శనం సమయం లభిస్తోంది. కనుక  భక్తులు, ఇది గమనించి ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుని తిరుపతికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. . పూర్తి వివరాలు తెలుసుకోకుండా తిరుపతి కి వచ్చి ఇబ్బందులు పడవద్దని భక్తులకు టీటీడీ సూచిస్తోంది.

Also Read:

మనిషి జీవితంలో ఈ 5 పాఠాలు తెలుసుకుంటే.. ఎప్పటికీ మోసపోరంటున్న చాణక్య..