Pournami Garuda Seva: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య శ్రీమలయప్ప స్వామి రూపంలో గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనూ గరుడ వాహనోత్సవం అతి కీలకమైనదిగా భావిస్తారు.
గరుడవాహనంపై మాడ వీధుల్లో స్వామివారు దర్శనంతో భక్త జనం ఉప్పోంగిపోయారు. శ్రీమలయప్ప రూపంలో దర్శినమిచ్చే స్వామివారిని చూడడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ గరుడసేవలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి, అధికారులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..