ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించదని పండితులు చెబుతున్నారు. దీంతో ఈ సంవత్సరం ఏర్పడబోయే తోడు సూర్యగ్రహణం సూతక కాలం భారతదేశానికి వర్తించదు. అదే సమయంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మాత్రం సూతక కాలాన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ గ్రహణం ఏప్రిల్ 20న ఉదయం 7.4 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటల వరకు ఉంటుంది.
ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ సూర్యగ్రహణం చైనా, అమెరికా, మలేషియా, ఫిజీ, జపాన్, సమోవా, సోలమన్, సింగపూర్, థాయిలాండ్, కంబోడియా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వియత్నాం, తైవాన్, పాపువా న్యూ గినియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ భారత దేశాల్లో కనిపిస్తుంది. మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం. వంటి ప్రదేశాలలో కనిపిస్తాయి.
అయితే శాస్త్రీయ రుజువులు లేనప్పటికీ, మత విశ్వాసాల ప్రకారం గ్రహణం వేళ గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రహణం వేళలో బయట సంచరించకూడదని ఇంట్లోనే తలుపులు వేసుకొని ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణం అనంతరం కూడా బయట సంచరించకూడదని శాస్త్ర గ్రంథాల ఆధారంగా పండితులు చెబుతున్నారు. అదేవిధంగా వస్తువులు అయిన, బియ్యం, పప్పులు, నిల్వ పచ్చళ్లపై గరిక పోచలను వేయాలని శాస్త్రం చెబుతోంది
అదేవిధంగా గ్రహణం అనంతరం గర్భిణీలు స్నానం చేయాలని. మృత్యుంజయ మంత్రం చదవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే గ్రహణం వేళ భోజనం చేయకూడదని. ఎలాంటి ఆహారం తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. గ్రహణం సమయంలో పూజలు కూడా చేయకూడదు. కేవలం మంత్రోచ్ఛారణ మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ప్రార్థన చేస్తే మంచిది. అయితే ప్రస్తుత గ్రహణం మన దేశంలో పాక్షికంగా కూడా కనిపించడం లేదు కావున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మాత్రం గ్రహణం వేళ ఈ జాగ్రత్తలు పాటించాలని పండితుడు నొక్కి వక్కాణిస్తున్నారు.
ఇదిలా ఉంటే గ్రహణం సందర్భంగా గర్భిణీలు ప్రసవ వేదన పడినట్లయితే, వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని, లేకపోతే ఇంట్లోనే ఉంచితే తల్లి బిడ్డ ప్రమాదంలో పడే అవకాశం ఉందని మరికొందరు పండితులు చెబుతున్నారు. ప్రసవం జరిగితే నష్టం ఏమీ లేదని. కావాలంటే పుట్టిన పిల్లవాడి పేరిట శాంతి జరిపిస్తే సరిపోతుందని. గ్రహణం వేళ పుట్టిన వారిలో చాలామంది మహర్జాతకులు అయ్యారని పండితులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)