Zodiac Signs: రాశి ఫలాలు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. జీవితంలోని ముఖ్య ఘటనలు రాశి చక్రం ఆధారంగా జరుగుతాయని భావిస్తుంటారు. అందుకే రాశిఫలాలను నిత్యం పరిశీలిస్తుంటారు. ఏ సమయంలో ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? అనే వివరాలను తెలుసుకుంటారు. ఇదిలాఉంటే.. కొందరు వ్యక్తులు పెళ్లి గురించి పెద్దగా ఆసక్తి చూపరు. ఒంటరిగా ఉండేందుకే ఆసక్తి చూపుతారు. అదే సమయంలో మరికొందరు పెళ్లి చేసుకోవాలని ఉబలాటపడుతుంటారు. త్వరగా జీవిత భాగస్వామిని తెచ్చుకోవాలని ఆలోచిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వివాహ ఆలోచనను ఇష్టపడే, త్వరగా వివాహం చేసుకునే అవకాశం ఉన్న వారిలో ఈ నాలుగు రాశుల వారు ప్రధానంగా ఉంటారు. మరి ఆ నాలుగు రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథునం..
మిథునం రాశి కలవారిని సామాజిక సీతాకోకచిలుకలుగా అభివర్ణిస్తారు. వారు ప్రజల చుట్టూ ఉండటానికి, ఇష్టమైన వ్యక్తుల చుట్టూ ఉండటానికి ఆసక్తి చూపుతారు. వివాహం విషయానికి వస్తే.. వారు భాగస్వామి అవసరం అని భావిస్తారు. త్వరగా వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు.
కర్కాటక రాశి..
ఈ రాశి వ్యక్తులు తమ జీవితంలో భావోద్వేగ శూన్యతను పూరించాల్సిన అవసరం ఉందని భావిస్తారు. వారు సాన్నిహిత్యం, విధేయతను కోరుకుంటారు. ఈ విధంగా, ముందస్తు వివాహంపై వారు ఆలోచన చేస్తారు.
తులారాశి..
తులారాశి వారు ఇతరులకు ప్రేమను పంచుతారు. అయితే ప్రేమ వైఫల్యం కారణంగా వారు ఒంటరిగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తారు. వివాహం విషయానికి వస్తే వారిని అర్థం చేసుకుని, జీవితంలో వారికి మద్దతునిచ్చే వ్యక్తిని వారు కోరుకుంటారు. వీరు త్వరగా వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. 20 ఏళ్ళ వయసు దాటిన వెంటనే వీరికి వివాహం జరిగే ఛాన్స్ ఉంది.
కన్యా రాశి..
ఈ రాశి వారికి అపార జ్ఞానం ఉంటుంది. తమ పనులు తాము చేసుకునే శక్తి కలిగి ఉంటారు. కానీ, చివరికి వారిని ఓదార్చే, అండగా ఉండే వారిని కోరుకుంటారు. కష్టపడేతత్వం కలిగిన ఈ రాశి వారికి.. సానుభూతి చూపేవారు కావాలని కోరుకుంటారు. ఈ కారణంగానే త్వరగా వివాహం చేసుకోవాలని భావిస్తుంటారు.
Also read:
Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..