
ఆదివారం మాంసాహారానికి దూరంగా ఉండాలని చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటారు. భగవంతుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలి. అనేకమంది తమ ఆహారపు అలవాట్లను పాటించినప్పటికీ, మాంసాహారం స్వీకరించేవారు మాత్రం ఆదివారం నాడు దీనిని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది. ఆదివారం సెలవు దినం కావడం, కుటుంబంతో కలిసి మాంసాహారం తినే సంప్రదాయం ఉన్నప్పటికీ, శాస్త్ర పరిజ్ఞానం ప్రకారం ఇది నిగూఢ రహస్యాన్ని కలిగి ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం రోజును పవిత్రంగా భావించి, ఆ రోజున సూర్య భగవానునికి పూజలు చేసి, సాత్వికమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనకు ఎంతో మేలు కలుగుతుంది.
ఆదివారం మాంసాహారం తినడం వలన సూర్య భగవానుడి ఆగ్రహానికి గురికావలసి వస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అన్న నానుడి ప్రకారం సూర్యుడు ఆరోగ్య ప్రదాత. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడు సూర్యుడు. అందుచేత శివ ఆరాధన, సూర్య ఆరాధన సమానంగా పరిగణించబడతాయి. ఆదివారం మాంసాహారం తినేవారి ఆరోగ్యం ప్రభావితమవుతుందని సూర్య భగవానుడు స్వయంగా చెప్పినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.
కాబట్టి, ఆదివారం నాడు మాంసాహారాన్ని భుజించవద్దు. ఆదివారం మాంసాహారం తినకుండా ఉండేవారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని సూర్య భగవానుడు ప్రసాదించాడు. మీకు అశ్వమేధ యాగ ఫలితం కావాలనుకుంటే, ఆదివారం మాంసాహారాన్ని విడిచిపెట్టండి.
మన భారతీయ సంప్రదాయాలు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మన జీవితాన్ని సుసంపన్నంగా మార్చే విధంగా ఏర్పడినవి. కాలక్రమేణా విదేశీ సంస్కృతుల ప్రభావంతో కొన్ని సంప్రదాయాలు మారిపోయినా, ఆదివారం రోజును పవిత్రంగా పాటిస్తూ మాంసాహారం తినకుండా ఉంటే ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు పొందవచ్చు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)