Yadadri Temple: యాదాద్రికి కామిని ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తులు .. మంత్రి ఎర్రబెల్లి దంపతులు ప్రత్యేక పూజలు

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగీరిశుడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నేరుగా అమెరికా నుంచి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యాదగిరిగుట్టకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Yadadri Temple: యాదాద్రికి కామిని ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తులు .. మంత్రి ఎర్రబెల్లి దంపతులు ప్రత్యేక పూజలు
Yadadri Temple Rush

Edited By:

Updated on: Jul 14, 2023 | 5:57 AM

భక్తజన బాంధవుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కామిక ఏకాదశి కావడంతో అనేకమంది భక్తులు దర్శించుకున్నారు. కామిక ఏకాదశి పర్వదినం కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పొందారు.
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగీరిశుడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

నేరుగా అమెరికా నుంచి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యాదగిరిగుట్టకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ కృషితో యాదాద్రి క్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలసిందని మంత్రి దయాకర్ రావు అన్నారు. రెండో తిరుపతిగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో లక్ష్మీ నరసింహుడు భక్తుల కోరికలను తీర్చుతూ కొంగు బంగారంగా మారాడని ఆయన అన్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us