Ganesh Idol Immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనంపై గందరగోళం.. హైకోర్టు తీర్పుని లెక్కచేయమంటున్న గణేష్‌ ఉత్సవ్‌ సమితి

|

Sep 14, 2021 | 3:02 PM

Ganesh Idol Immersion:హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మరింది. ఇప్పుడు భాగ్యనగరంలోని గణపతి విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. హుస్సేన్‌సాగర్‌లో ..

Ganesh Idol Immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనంపై గందరగోళం.. హైకోర్టు తీర్పుని లెక్కచేయమంటున్న గణేష్‌ ఉత్సవ్‌ సమితి
Ganesh Idol
Follow us on

Ganesh Idol Immersion:హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మరింది. ఇప్పుడు భాగ్యనగరంలోని గణపతి విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ఆఫ్‌ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దన్న తీర్పును అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో నిమజ్జనం ఎక్కడ అనేది మళ్ళీ మొదటికి వచ్చింది. నగరంలో ఉన్న వేలాది విగ్రహాల నిమజ్జనం ఎక్కడా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. మరోవైపు నిమజ్జనానికి మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటం.. మరోవైపు ప్రభుతం సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో.. నిమజ్జనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మంత్రి తలసాని శ్రీనివాస్:

గణేష్ చతుర్థికి దేశంలోనే హైద్రాబాద్ ది ప్రత్యేక స్దానముందు. అందుకు తగిన విధంగా తెలంగాణ ప్రభుత్వం చేసిందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అంతేకాదు గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అంతేకాదు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని.. రేపటిలోగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నామని తెలిపారు. ట్యాంక్ బండ్ సహా గ్రేటర్ పరిధిలో అనేక లేక్స్ లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని చెప్పారు మంత్రి తలసాని. అంతేకాదు హుస్సేన్ సాగర్ లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామనటం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అభిప్రాయం మాత్రమేనని.. వారి అభిప్రాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం లేదన్నారు తలసాని. శోభాయాత్ర ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే హైదరాబాద్ గణేష్ శోభాయాత్ర కు ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షలాది మంది పాల్గొంటారని వివరించారు. భక్తుల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న విషయాన్ని మంత్రి వివరించారు.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి

హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి అంటుంది. అంతేకాదు.. నిమజ్జనానికి ఏర్పాట్లు చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని.. ఎక్కడా హైకోర్టు నిమజ్జనం చేసుకోవద్దని చెప్పలేదన్నారు. ఇక హైకోర్టు తీర్పును అమలు చేస్తారా చేయారా అనేది తెలంగాణ ప్రభుత్వం ఇష్టం.. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచైనా సరే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. నిమజ్జనం అనాదిగా వస్తోన్న సంప్రదాయం.. తాము దానినే కొనసాగిస్తామని అంటున్నారు. కోర్టు తీర్పులకు కాదని జల్లికట్టు లాంటి పండుగలను నిర్వహిస్తున్నారని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు గుర్తు చేశారు.

Also Read: Girlfriend: తాగుబోతులకు, తిరుగుబోతులకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. నాకూ కావలి..వెదికి పెట్టమని ఎమ్మెల్యేకు ఓ యువకుడు లెటర్..