
నిద్రపోతున్నప్పుడు కలలు రావడం సాధారణమే.. అయితే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని ప్రతి ఒక్కరి నమ్మకం. కలల్లో రకరకాల జంతువులు, వస్తువులు, సంఘటనలు కనిపిస్తాయి. అయితే మీ కలలో కొన్ని రకాల జంతువులు పదే పదే కనిపిస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం ఆ జంతువులు మీకు అదృష్టం రానుందని తెలియజేస్తాయట.

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కొన్ని విషయాలు మీకు భవిష్యత్తులో జరగనున్న సంఘనలను సూచిస్తాయి. చాలాసార్లు మనం ఒకే విషయాన్ని మన కలలలో పదే పదే చూస్తాము. చాలాసార్లు కలలో కనిపించే విషయాలు నిద్ర లేచిన తర్వాత కూడా ఆ కల మీ మనసుని వీడకుండా మనసులో అలాగే ఉంటుంది. అయితే ప్రతి కల మీకు ఏదో చెబుతుందని తెలుసా.. అంటే ప్రతి కల వెనుక కొన్ని అర్థాలు దాగి ఉంటాయి. కలలో కొన్ని జంతువులను చూడటం చాలా శుభప్రదం. కలలో ఏ జంతువు కనిపిస్తే శుభప్రదమో ఈ రోజు తెలుసుకుందాం..

కలలో ఏనుగును చూడటం..ఏ వ్యక్తి అయినా తన కలలో ఏనుగును చూసినట్లయితే.. అతనికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయని అర్థం. ఈ కల ఆ వ్యక్తి సంపద , శ్రేయస్సును పొందుతాడని సూచిస్తుంది. ఈ కల ద్వారా త్వరలో జీవితంలో సుఖ సంతోషాలు కలగానున్నాయని తెలియజేస్తుందట.

హిందూ మతంలో ఆవుకు పూజ్యనీయమైన స్థానం ఇవ్వబడింది. ఏ వ్యక్తి కలలోనైనా ఆవును కనిపిస్తే అది శుభ సంకేతం. కలలో ఆవును చూడటం అంటే దేవుడు ఆ వ్యక్తిపై తన ఆశీర్వాదాన్ని కురిపించానున్నాడని అర్ధం. రానున్న రోజుల్లో మీరు చేపట్టిన ఏపనిలోనా విజయం సాధిస్తారని అర్థం.

నిశాచరులైన గుడ్లగూబలు తరచుగా కలలలో కనిపిస్తాయి. మీరు కలలో గుడ్లగూబలను చూసినట్లయితే.. ఆ కలకు అర్ధం ఏమిటంటే.. జీవితంలో సంపద పెరుగుతుందని అర్థమట. కలలో గుడ్ల గూబని చూసిన వ్యక్తులపై లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయట.

కలలో పామును.. ముఖ్యంగా నల్ల పామును చూడటం శుభప్రదం. రాబోయే రోజుల్లో సమాజంలో మీ కీర్తి పెరుగుతుందని అర్థం. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది.

ఏ వ్యక్తి కలలోనైనా కుందేలును చూసినట్లయితే అది శుభ సంకేతం అని అర్థం చేసుకోండి. దీని అర్థం మీ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మీరు చేపట్టిన ప్రతిదానిలోనూ విజయం సాధిస్తారు.