Ayodhya: కల సాకారమవుతున్న వేళ.. 500ఏళ్ల తపస్సుకు ముగింపు.. సంప్రదాయ తలపాగా ధరించిన సరిరాసి గ్రామస్థులు

|

Jan 19, 2024 | 3:39 PM

కరసేవకులకు ఆహారం, వసతి, సహాయం అందించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సభ్యుడు, సరిరాసి గ్రామ నివాసి అయిన శివ్ సింగ్.. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సూర్యవంశ ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన కనీసం ఒకరినైనా ఆహ్వానించాలని ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు విజ్ఞప్తి చేశారు.

Ayodhya: కల సాకారమవుతున్న వేళ.. 500ఏళ్ల తపస్సుకు ముగింపు.. సంప్రదాయ తలపాగా ధరించిన సరిరాసి గ్రామస్థులు
Sarairasi Villagers
Follow us on

ఇస్లామియ రాజు హయాంలో రామయ్య జన్మించిన భూమి అయోధ్యలో రామాలయం కూల్చివేత సమయంలో ఆలయాన్ని కాపాడేందుకు సూర్యకుల క్షత్రీయ వంశస్థులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడారు. ఎంత సాహసోపేతంగా పోరాడిన ఈ సూర్యకుల క్షత్రీయవంశ సైనికులు ఆలయాన్ని కూల్చివేతను ఆపలేకపోయారు. దుర్ఘటన పట్ల చాలా బాధపడ్డారు. అంతేకాదు రామాలయంలో మొఘల్ చక్రవర్తి బాబర్ నిర్మించిన మసీదును కూల్చివేసి.. అక్కడ రామమందిరాన్ని నిర్మించే వరకు తమ వంశస్థులు తలపాగాలను, చెప్పులను ధరించరని ప్రతిజ్ఞ చేశారు. అయోధ్య తో పాటు పొరుగున ఉన్న బస్తీ జిల్లాలో సరయు నదికి ఇరు తీరాల్లో ఉన్న సుమారు 115 గ్రామాలలో నివసిస్తున్న సూర్యవంశీ ఠాకూర్లు తమను తాము శ్రీరాముని వారసులుగా గుర్తించుకుంటారు.

1990లలో రామజన్మభూమి ఉద్యమ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కరసేవకులను ఆదుకోవడంలో సూర్యవంశీ ఠాకూర్లు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వారి 500 సంవత్సరాల తపస్సు ముగియనుంది.

ఇవి కూడా చదవండి

 దాదాపు 500 సంవత్సరాల తర్వాత రామాలయం ‘ప్రాణప్రతిష్ఠ’కు ముందు తలపాగాలు

కరసేవకులకు ఆహారం, వసతి, సహాయం అందించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సభ్యుడు, సరిరాసి గ్రామ నివాసి అయిన శివ్ సింగ్.. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సూర్యవంశ ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన కనీసం ఒకరినైనా ఆహ్వానించాలని ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..