Sunday Puja Tips
హిందూ మతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. అదేవిధంగా ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యుడిని పూజిస్తారు. ఈ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు నిండిపోతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో ఆదివారం కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలు సూచించబడ్డాయి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని… కోరిన కోర్కెలు తీరతాయని నమ్ముతారు.
ఆదివారం చేయాల్సిన చర్యలు ఏమిటంటే
- హిందూ మతంలో ఉపవాస సమయంలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇతర ఆహార పదార్థాలతో పాటు పాలు, బియ్యం , బెల్లం దానం చేయడం ద్వారా సూర్య భగవానుడు అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం.
- ఆర్థిక సంక్షోభం తొలగిపోవడానికి.. ఎవరైనా ఆర్థిక సంక్షోభంతో బాధపడుతుంటే ఆదివారం రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేశీ నెయ్యితో దీపం వెలిగించాలీ. ఇలా చేయడం వలన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులపై లక్ష్మీదేవి ఆశీస్సులు నిలిచి ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారని నమ్ముతారు.
- చేపట్టిన పనులు పూర్తికావాలంటే.. ఆదివారం ఎర్ర చందనం తిలకం పెట్టుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి. సూర్యుడికి ఇష్టమైన బియ్యం పరమాన్నం ను నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వలన పెళ్లిన పనిలో విజయం సాధించే అవకాశం ఉందని నమ్మకం.
- ఆనందం,శ్రేయస్సు కోసం.. జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, కీర్తిప్రతిష్ఠలు కలగాలంటే ఆదివారం రోజున రావి చెట్టు కింద పిండితో చేసిన దీపాలను నాలుగు దిక్కుల నాలుగు దీపాలను వెలిగించండి. అయితే ఈ దీపాలను నువ్వుల నూనెతో మాత్రమే వెలిగించాలని గుర్తుంచుకోండి.
- ఏ రంగు ధరించడం శుభప్రదం.. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాదు ఎరుపు రంగు దుస్తులను కూడా దానం చేయవచ్చు. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి సూర్యభగవానుని పూజించాలి.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.