Srisailam Temple: మకర సంక్రాంతి పర్వదినం సంరద్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి(11వ తేదీ నుంచి) ఈనెల 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులు ఆలయాన్ని అంగరంగ వైభవంగా సర్వాంగసుందరంగా తీర్చి దిద్దుతున్నారు. విద్యుత్ దీపకాంతులతో సుందరీకరించారు. బ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్ల ఆలయంతో పాటు ఉప ఆలయాలకూ రకరకాల విద్యుత్ అలంకరణ చేశారు. పూల తోరణాలతో అలంకరణలు చేశారు. వివిధ అలంకరణలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయ వైభవాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు.
కాగా, కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. ఉత్సవాల సమయంలో ప్రతిరోజు ప్రాకారోత్సవం మాత్రమే జరిపించబడుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాకారోత్సవం సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆర్జిత హోమాలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, చండీహోమం, స్వామి, అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
Also read:
భారత తయారీ వ్యాక్సిన్‌పై డ్రాగన్ కంట్రీ ప్రశంసలు.. భారత సామర్థ్యాన్ని అయిష్టంగానే అంగీకరించిన చైనా