Sri Rama Navami: కన్నుల పండువగా రాములోరి కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

Sri Rama Navami: రాములోరి కల్యాణ వేడుకతో పులకించిపోతోంది భద్రాద్రి(Bhadradri). శ్రీ సీతారామచంద్రుల వివాహ మహోత్సవానికి అందంగా ముస్తాబైంది మిథిలా స్టేడియం(Mithila Stadium). రెండేళ్ల తర్వాత వేలాది..

Sri Rama Navami: కన్నుల పండువగా రాములోరి కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
Sirarama Kalyanam Bhadradri

Updated on: Apr 10, 2022 | 11:35 AM

Sri Rama Navami: రాములోరి కల్యాణ వేడుకతో పులకించిపోతోంది భద్రాద్రి(Bhadradri). శ్రీ సీతారామచంద్రుల వివాహ మహోత్సవానికి అందంగా ముస్తాబైంది మిథిలా స్టేడియం(Mithila Stadium). రెండేళ్ల తర్వాత వేలాది మంది భక్తుల నడుమ మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణ వేడుక అంగరంగవైభవంగా జరుగుతోంది. రాష్ట్రప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించారు. కరోనాతో రెండేళ్లుగా వేడుకలు జరగలేదని.. ఈ ఏడాది వైభవంగా రాములోరి కల్యాణ క్రతువు జరుగుతోందన్నారు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇక టిటిడి తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామన్నారు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.

జగదభిరాముడి కల్యాణ వేడుక రెండేళ్ల తర్వాత అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆ కమనీయ ఘట్టాన్ని వీక్షించేందుకు రెండు కళ్లు కూడా సరిపోవన్నంతగా ఆతృతగా చూస్తోంది భక్త కోటి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆ శుభ ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు. సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చి వేదికపై ఆసీనులను చేశారు. మరికొద్దిసేపట్లో ఆ మధుర ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది.

మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్‌ లగ్న సుముహూర్తాన సీతారాముల కల్యాణ క్రతువు జరగనుంది. వేదమంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా అర్చకులు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీతమ్మ తల్లి మెడలో రాములోరు తాళి కట్టే మధుర ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకొచ్చిన భక్తులతో మిథిల స్టేడియం కిక్కిరిసిపోయింది.

 

Also Read: Viral Video: నూతన వధూవరులకు విసన కర్రలు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా అంటూ.. ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్..

Sri Ramanavami: ఘనంగా మొదలైన ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం శేషవాహనం సేవ