Solar Eclipse: సూర్యగ్రహణంలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి? భారతీయులు ఈ అరుదైన దృశ్యాన్ని చూడగలరా.. తెలుసుకోండి

|

Sep 30, 2024 | 3:31 PM

సూర్యగ్రహణం అక్టోబర్ 2 రాత్రి 9.13 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే అక్టోబర్ 3 మధ్యాహ్నం 3.17 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం సంభవించినప్పుడు, భారతదేశంలో రాత్రి సమయం ఉంటుంది. అందువల్ల ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఖగోళంలో అరుదైన ఘటన రింగ్ ఆఫ్ ఫైర్‌ను భారతీయులు చూడలేరు. ఇది అర్జెంటీనా, పెరూ, దక్షిణ అమెరికా, ఇతర ప్రదేశాలలో కనిపిస్తుంది. సూర్యగ్రహణం రాత్రి పడే సమయం వల్ల భారతదేశంలో సూతకాల కాలం ఉండదు.

Solar Eclipse: సూర్యగ్రహణంలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి? భారతీయులు ఈ అరుదైన దృశ్యాన్ని చూడగలరా.. తెలుసుకోండి
Solar Eclipse Ring Of Fire
Follow us on

భూమి, సూర్యుని మధ్య చంద్రుడు వెళ్ళినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ భూమికి కనిపించదు. ఈ ఖగోళ ఘటనను సూర్యగ్రహణం అని అంటారు. ఈ ఏడాది(2024) రెండో సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యగ్రహణం కూడా. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడల్లా ఆకాశంలో కొన్ని అరుదైన దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. వీటిలో రింగ్ ఆఫ్ ఫైర్ కూడా ఒకటి. ఈసారి కూడా సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు చుట్టూ అగ్ని వలయంలా కనిపించానుంది. ఈ అరుదైన దృశ్యం భారతదేశంలో కూడా కనిపిస్తుందో లేదో తెలుసుకుందాం.

సూర్యగ్రహణం ఎన్ని రకాలు?

సూర్యగ్రహణం గురించి మాట్లాడుతే మొత్తం 3 రకాలు ఉన్నాయి. మొదటి సూర్యగ్రహణాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు భూమిని పూర్తిగా కప్పేస్తాడు. ఈ సమయంలో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు. భూమిపై సూర్యుడి వెలుగు పడకుండా చంద్రుడు కప్పెయ్యండతో పూర్తి అంధకారం కమ్ముకుంటుంది.

రెండవ గ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. ఇందులో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. చంద్రుడి నీడ సూర్యుడిలోని కొంత భాగాన్ని కప్పి ఉంచితే సూర్యుడి నీడ పాక్షికంగా భూమిపై పడుతుంది. ఈ పరిస్థితిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు.ఈ సమయంలో సూర్యుడి కొంత భాగమే కనిపిస్తుంది. మిగతా భాగం నల్లగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మూడవ సూర్యగ్రహణాన్ని వార్షిక సూర్యగ్రహణం అంటారు. ఇందులో చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్య చాలా దూరంలో వెళతాడు. చంద్రుని స్పష్టమైన వ్యాసం సూర్యుని కంటే తక్కువగా ఉన్నప్పుడు వార్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది

రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి?

వార్షిక సూర్యగ్రహణం సమయంలో చంద్రుని నీడ సూర్యునిపై పడినప్పుడు రింగ్ ఆకారంలో దృశ్యం కనిపిస్తుంది. దీని కాంతి చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. సైన్స్ భాషలో దీనిని యాన్యులర్ సొలార్ ఎక్లిప్స్ అని కూడా అంటారు. అయితే ప్రతి గ్రహణంలోనూ ఈ దృశ్యం కనిపించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఇలాంటి అరుదైన దృశ్యం ఏడాదికి ఒకసారి కనిపిస్తూ ఉంటుంది. ప్రజలు కూడా ఈ దృశ్యాన్ని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

రింక్ ఆఫ్ ఫైర్ భారత్ లో కనిపిస్తుందా?

సూర్యగ్రహణం అక్టోబర్ 2 రాత్రి 9.13 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే అక్టోబర్ 3 మధ్యాహ్నం 3.17 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం సంభవించినప్పుడు, భారతదేశంలో రాత్రి సమయం ఉంటుంది. అందువల్ల ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఖగోళంలో అరుదైన ఘటన రింగ్ ఆఫ్ ఫైర్‌ను భారతీయులు చూడలేరు. ఇది అర్జెంటీనా, పెరూ, దక్షిణ అమెరికా, ఇతర ప్రదేశాలలో కనిపిస్తుంది. సూర్యగ్రహణం రాత్రి పడే సమయం వల్ల భారతదేశంలో సూతకాల కాలం ఉండదు. సూత కాలం అంటే ఏదైనా శుభ కార్యాలు నిషేధించబడిన సమయం. ఈ కాలంలో దేవాలయాల తలుపులు కూడా మూసివేయబడతాయి. అయితే ఈసారి భారతదేశంలో సూర్య గ్రహణం ప్రభావం చూపదు కనుక..సూత కాలం ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి