హిందూ మతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రత మహిమ శివపురాణంలో పేర్కొనబడింది. ఈ వ్రతాన్ని ప్రతి నెల త్రయోదశి తిధి రోజున ఆచరిస్తారు. ఈ ఉపవాసం నెలకు రెండుసార్లు వస్తుంది. ఈ రోజున శివుని పూజించి ఉపవాసం ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రజలు ఈ రోజున ఉపవాసం ఉంటే పరమశివుని విశేష ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఈ రోజున ఉపవాసం చేసి శివుడిని,శనిశ్వరుడిని పూజిస్తే ఆ ఇళ్లలో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. అదే సమయంలో బాధలన్నీ తొలగిపోతాయని విశ్వాసం.
ఈ సంవత్సరం మొదటి శని ప్రదోష వ్రతం ఎప్పుడంటే
ఈ ఏడాది తొలి ప్రదోష వ్రతం శనివారం వచ్చింది. అందుకే దీనిని శని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శని ప్రదోష వ్రతం జనవరి 11 ఉదయం 8.21 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ జనవరి 12 ఉదయం 6:33 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం శని ప్రదోష వ్రతం జనవరి 11 న ఆచరించనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.