
2025 సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడతాయి. వాటిలో రెండు ఇప్పటికే సంభవించాయి. ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి 14న సంభవించగా, సూర్యగ్రహణం మార్చి 29న అమావాస్య నాడు సంభవించింది. అయితే ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో కనిపించలేదు. ఇప్పుడు ప్రజలు తదుపరి రెండు గ్రహణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తదుపరి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకోవడానికి కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపధ్యంలో సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? భారతదేశంలో ఈ ఖగోళ సంఘటన ప్రభావం ఉంటుందా లేదో తెలుసుకుందాం..
ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025న ఏర్పడనుంది. అంటే రెండవ చంద్ర గ్రహణం భాద్రపదమాసం పౌర్ణమి రోజున ఏర్పడనుంది. ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 12:23 గంటల వరకు ఉంటుంది.
ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. అయితే ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. కనుక మన దేశంలో రెండో చంద్ర గ్రహణం కనిపిస్తుంది. దీని సూతక కాలం కూడా చెల్లుతుంది. గ్రహణానికి 8 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.