
శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శనీశ్వరుడిని సరైన ఆచారాలతో పూజించడం ద్వారా.. శనీశ్వరుడి నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. ఒక వైపు శనీశ్వరుడి అశుభ ప్రభావాల వల్ల వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మరోవైపు శనీశ్వరుడి శుభ ప్రభావాల వల్ల వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతాడు. శనీశ్వరుడి పేదవాడిని కూడా రాజును చేయగలడని నమ్ముతారు. శనీశ్వరుడిని పూజించేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం…
హిందూ మత విశ్వాసాల ప్రకారం శనీశ్వరుడి కళ్ళలోకి చూడకూడదు. శనీశ్వరుడిని పూజించేటప్పుడు ఎల్లప్పుడూ మీ కళ్ళను క్రిందికి ఉంచుకోవాలి. శనీశ్వరుడిని కంటితో చూడడం ద్వారా ఆయన చెడు దృష్టికి గురయ్యే అవకాశం ఉంది.
శనిశ్వరుడి విగ్రహం ముందు నిలబడి పూజించకూడదు. ముఖ్యంగా చేతిలో కత్తి పట్టుకుని ఉన్న శనిశ్వరుడి ముందు నిలబడి పూజించడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి. శనివారం కొన్ని పరిహారాలను రోజూ చేయడం ద్వారా.. నిద్రపోతున్న అదృష్టం కూడా మేల్కొంటుంది. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు