Minister Roja: పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సంక్రాంతి సంబరాలు.. కత్తి కట్టని కోడితో పందాలు మొదలు పెట్టిన మంత్రి రోజా

|

Jan 12, 2023 | 11:01 AM

సాంస్కృతిక సంప్రదాయాలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిధిగా పర్యటక మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ముగ్గులు పెట్టారు. అంతేకాదు.. కోడిపందాలకు ఒక వైపు నిషేధమంటూనే మరోవైపు ఆటవిడుపుగా కోళ్ల  పోటీలు పెట్టారు. 

Minister Roja: పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సంక్రాంతి సంబరాలు.. కత్తి కట్టని కోడితో పందాలు మొదలు పెట్టిన మంత్రి రోజా
Minister Roja At Pongal Festival Celebrations
Follow us on

పట్టణ ప్రజలు పల్లె బాట  పట్టారు. తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరాల సందడి మొదలైంది. సామాన్యులు, సెలబ్రెటీలు, ప్రజాప్రతినిధులు ఇలా ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగ కోసం రెడీ అవుతున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో ముందుగా సంక్రాంతి సంబరాలను ప్రభుత్వ అధికారులు, పోలీసులు నిర్వహిస్తున్నారు. తాజాగా  తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగుల రంగుల రంగవల్లుల పోటీలు, గంగిరెద్దుల ఆటలు వేడుకలను నిర్వహించారు. సాంస్కృతిక సంప్రదాయాలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిధిగా పర్యటక మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ముగ్గులు పెట్టారు. అంతేకాదు.. కోడిపందాలకు ఒక వైపు నిషేధమంటూనే మరోవైపు ఆటవిడుపుగా కోళ్ల  పోటీలు పెట్టారు.

కోళ్లకు కత్తులు కట్టకుండానే కోళ్లను రంగంలో దింపి సంబరాలు నిర్వహించారు తిరుపతి పోలీసులు. తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా కోళ్లను పట్టుకుని పోటీకి వదలారు. పోటీలను వీక్షిస్తూ వినోదం పంచుకున్నారు పోలీసులు. తమ పరిధులో కోడి పందాలు జల్లికట్టు నిర్వహణకు అనుమతులు లేవని డీఐజీ స్పష్టం చేశారు. అంతేకాదు పోటీలు జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే నిఘా పెట్టామని , పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

నిషేధాజ్ఞలు కాదని..  కోడిపందాలు జల్లికట్టు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కోడి పందాలను సంప్రదాయ క్రీడగా పోలీసులే నిర్వహించడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏది నేరం… ఏది వినోదమన్న విషయంపై చర్చ జరుగుతుంది.

మరిన్ని ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..