Samatha Kumbh 2026: ముచింతల్‌లోని సమతామూర్తి కేంద్రంలో ఘనంగా సమతాకుంభ్–2026 ఉత్సవాలు

Updated on: Jan 31, 2026 | 9:46 PM

రంగారెడ్డి జిల్లా ముచింతల్‌లోని సమతామూర్తి కేంద్రంలో సమతాకుంభ్–2026 ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం అగ్ని ప్రతిష్ట అనంతరం శ్రీరాముల వారి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది.

రంగారెడ్డి జిల్లా ముచింతల్‌లోని సమతామూర్తి కేంద్రంలో సమతాకుంభ్–2026 ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం అగ్ని ప్రతిష్ట అనంతరం శ్రీరాముల వారి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలతో సమతామూర్తి ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించగా, 1000 మంది చిన్నారులు గోదాదేవి రూపాల్లో నృత్య ప్రదర్శన చేసి భక్తులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా 1 నుంచి 18 వరకు దివ్యదేశ మూర్తులకు గరుడ వాహన సేవలు ఘనంగా నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ మరింత పెరిగింది. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.