Sabarimala Ayyappa Temple: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. నేడు తెరుచుకోనున్న ఆలయం.. కానీ..

Sabarimala Ayyappa temple: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్‌న్యూస్.. ఈ రోజు కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌లం ఆల‌యం తెరుచుకోనుంది. తులా మాసం పూజ‌ల సందర్భంగా శనివారం

Sabarimala Ayyappa Temple: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. నేడు తెరుచుకోనున్న ఆలయం.. కానీ..
Sabarimala

Updated on: Oct 16, 2021 | 8:31 AM

Sabarimala Ayyappa temple: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్‌న్యూస్.. ఈ రోజు కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌లం ఆల‌యం తెరుచుకోనుంది. తులా మాసం పూజ‌ల సందర్భంగా శనివారం సాయంత్రం 5 గంట‌ల‌కు అయ్యప్ప ఆల‌యాన్ని తెర‌వ‌నున్నట్లు ట్రావెన్‌కోర్ బోర్డు వెల్లడించింది. భక్తులను రేప‌ట్నుంచి ఈ నెల 21వ తేదీ వ‌ర‌కు అయ్యప్ప ఆల‌యంలోకి అనుమ‌తించనున్నారు. అయితే.. రేపు డ్రా పద్దతిలో శ‌బ‌రిమ‌ల ఆల‌య ప్రధాన పూజారిని ఎంపిక చేయ‌నున్నట్లు కూడా వెల్లడించింది. ఐదు రోజుల తులా మాస పూజల అనంతరం 21న శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని ట్రావెన్ కోర్ బోర్డు మూసివేయ‌నుంది. మ‌ళ్లీ న‌వంబ‌ర్ 2వ తేదీన ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. ఆ రోజు పూజల అనంతరం ఆ మ‌రుస‌టి రోజే ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత మండ‌లం, మ‌క‌ర‌విలాక్కు పండుగ నేప‌థ్యంలో న‌వంబ‌ర్ 15న ఆల‌యాన్ని మ‌ళ్లీ తెర‌వ‌నున్నారు.

అయితే.. ఈ ఐదు రోజులపాటు అయ్యప్పను దర్శించుకునే భక్తులను షరతులతో ఆలయంలోకి అనుమతించనున్నారు. కేరళలో కరోనా ఉధృతి పెరగుతున్న నేపథ్యంలో.. కోవిడ్ నిబంధనలతో భక్తులను అనుమతించాలని ప్రభుత్వం అధికారులకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. అయ్యప్పను ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్తుల‌ను వ‌ర్చువ‌ల్ బుకింగ్ ద్వారానే అనుమ‌తించనున్నారు. అయితే.. అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు.. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు ఉన్న స‌ర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.

Also Read:

Devaragattu Bunni Festival: దేవరగట్టు కర్రల సమరంలో పగిలిన తలలు.. 100 మందికిపైగా గాయాలు..

Horoscope Today: ఈ రాశుల వారు చేపట్టిన పనుల్లో పురోగతి.. శనివారం రాశి ఫలాలు..