యునెస్కో వారసత్వ సంపదకు ప్రమాద ఘంటికలు.. రామప్ప కోసం రంగంలోకి NGT!
కాలం మారినా..యుగాలు గడిచినా చరిత్ర చెరిగిపోదు.. నిర్మాణం గొప్పదైతే ఆ కీర్తి తరతరాలు నిలుస్తుంది.. పునాది గట్టిగా ఉంటే ఆ నిర్మాణం పది కాలాలపాటు నిలుస్తుందనడానికి రామప్ప దేవాలయం ఓ బెస్ట్ ఎగ్జాంపుల్.. 800 ఏళ్లు గడిచినా చెక్కు చెదరని ఆ చారిత్రక నిర్మాణం ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు మానవ తప్పిదంతో ముప్పు ముంచుకొస్తుంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల రామప్పకు ముప్పు వాటిల్లబోతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనుమతులపై నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు నమోదు చేసింది. అనుమతులు ఇచ్చిన అన్ని ప్రభుత్వ సంస్థలను బాధ్యులను చేస్తూ విచారణకు ఆదేశించింది. మరి సింగరేణి యాజమాన్యం ఏమంటుంది..! ఓపెన్ కాస్ట్ వల్ల రామప్పకు ముప్పు నిజమేనా..!

యునెస్కో గుర్తింపుతో రామప్ప దేవాలయం ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యిందని మురిసేలోపే ఈ చారిత్రక సంపదకు ఆపద ముంచుకొస్తుంది. తెలుగు రాష్ట్రాలలో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక నిర్మాణం రామప్ప దేవాలయం చుట్టూ ఇప్పుడు వివాదాలు ప్రదక్షిణలు చేస్తున్నాయి..రామప్ప ఆలయానికి సమీపంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు ఆందోళనకు దారితీస్తున్నాయి.
బొగ్గు నిక్షేపాల కోసం ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్న సింగరేణి సంస్థ రామప్ప సమీపంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం అడుగులు వేస్తోంది.. రామప్ప ఆలయానికి 5.8 కి.మీ దూరంలో ములుగు జిల్లాలోని వెంకటాపురం వద్ద సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు శ్రీకారం చుట్టింది. P.V నరసింహారావు ఓపెన్ కాస్ట్ గని పేరుతో పరిపాలన పరమైన అనుమతులు ఇప్పటికే లభించాయి. ఫారెస్ట్, పర్యావరణం, మైనింగ్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అనుమతులు లభించాయి.
ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్‌తో రామప్ప ఆలయానికి ఎలాంటి ముప్పు లేదంటున్న సింగరేణి సంస్థ చకచకా అడుగులు వేస్తుంది. మొత్తం 2400 ఎకరాలలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయబోతున్నారు..20 సంవత్సరాల పాటు 40 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఓపెన్ కాస్ట్ నిర్వహణకు అంతా సిద్ధమైంది.. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ 940 మందికి ఉపాధి లభిస్తుందని సింగరేణి సంస్థ చెబుతోంది.
ప్రభుత్వ అనుమతులు దాదాపుగా లభించాయి.. ఇక భూమి పొరల్లో దాగి ఉన్న నల్ల బంగారాన్ని వెలికి తీయడమే తరువాయి… ఇక్కడ ఓపెన్ కాస్ట్ తవ్వకాలతో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి..దీంతో ఈ ప్రాంత వాసులతోపాటు, రామప్ప పరిరక్షణ కమిటీ, ఇంటాక్ ప్రతినిధులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఆధ్వర్యంలో ఈ మైనింగ్ అడ్డుకునేందుకు పోరాటం మొదలైంది..
రామప్ప ఆలయం ఇసుక పునాదుల మీద నిర్మించిన ఆలయం. ఈ ఆలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటు చేయడం వల్ల పేలుళ్ల ధాటికి ఆలయం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 300 మీటర్ల లోతు బొగ్గు తవ్వకాలు జరపడం వల్ల రామప్ప ఆలయంతో పాటు, సరస్సుకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు.
గత కొద్దిరోజుల నుంచి సింగరేణి ఓపెన్ కాస్ట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా కేసు నమోదు చేసింది.. ఢిల్లీలోని ప్రధాన బెంచ్ నుండి చెన్నైలోని సదరన్ జోన్ బెంచ్ కు కేసు బదిలీ చేశారు.. ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతి ఇచ్చిన ఐదు ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వారికి నోటీసులు జారీ చేశారు..
డిసెంబర్ 21వ తేదీన ఈ కేసులో తదుపరి వాదనలు ఉంటాయి..రామప్ప సమీపంలో గని ఏర్పాటు నిర్ణయం పూర్తిగా పర్యావరణ పరిరక్షణ చట్ట విరుద్ధం అంటున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కన్వీనర్ ప్రో పాండురంగారావు NGT తీసుకుని నిర్ణయాన్ని హర్షిస్తున్నారు.. ఎన్జీటీ రామప్ప పరిరక్షణ కోసం కేసునమోదు చేయడం పట్ల ఈ ప్రాంత ప్రజలు రామప్ప పరిరక్షణ సమితి నుండి కూడా హర్షం వ్యక్తం అవుతుంది..
అయితే సింగరేణి సంస్థ వాదన మాత్రం మరోలా ఉంది. రామప్ప ఆలయానికి 5.8 కి.మీ దూరంలో ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటు చేయడం వల్ల రామప్ప ఆలయానికి ఎలాంటి ముప్పు ఉండదని వాదిస్తుంది. ఇక్కడ బొగ్గు నిక్షేపాలు వెలికితీయడం వల్ల దేశానికి వెలుగు జిలుగులు నింపడంతో పాటు బొగ్గు కొరతను నివారించవచ్చని వాదిస్తుంది.. NGT ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..!
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..