Vastu Tips: జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదంటే.. ఈ 4 వస్తువులను ఇంట్లో ఉత్తరం దిక్కులో పెడితే సరి..

|

Feb 03, 2023 | 6:15 AM

Vastu Tips: కొందరు ఎంత కష్టపడినా వారి ఇంట్లో సిరిసంపదలకు స్థానం లేనట్లుగా.. డబ్బంతా ఖర్చయిపోతుంది. అలాంటివారు తమ ఇంట్లో డబ్బుకొరత ఉండకూడదంటే

Vastu Tips: జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదంటే.. ఈ 4 వస్తువులను ఇంట్లో ఉత్తరం దిక్కులో పెడితే సరి..
Vastu Tips For Wealth
Follow us on

Vastu Tips: కొందరు ఎంత కష్టపడినా వారి ఇంట్లో సిరిసంపదలకు స్థానం లేనట్లుగా.. డబ్బంతా ఖర్చయిపోతుంది. అలాంటివారు తమ ఇంట్లో డబ్బుకొరత ఉండకూడదంటే ఐశ్వర్యానికి అధిదేవత లక్ష్మిదేవిని పూజించాలి. ఇలా చేసినా కూడా కొందరికి ఫలితం ఉండదు. ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు వేధిస్తూ ఉంటాయి. అప్పుల ఊబిలో పడి ఉండిపోతుంటారు. దీనికి వాస్తు దోషం కూడా కారణం కావచ్చు. ఇల్లు కట్టడం ఎంత ముఖ్యమో.. దానిని వాస్తు ప్రకారం నిర్మించారా లేదా అనేది కూడా అంతే ముఖ్యం. వాస్తు లోపాలుంటే ఇంట్లోనివారు చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. అందులో భాగంగానే ఉత్తరం దిక్కున ఈ వస్తువులను పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఆ దిక్కున ఏయే వస్తువులను పెట్టాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఇంటి ప్రధాన ద్వారం: వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించుకంటే ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉండవు. ఇంటి ప్రధాన ద్వారం సరైన దిశలో లేకుంటే అనేక రకాల సమస్యలు ఏర్పడుతాయి. ఎప్పుడైనా ఇంటి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉండాలి. అప్పుడే లక్ష్మి మాత అనుగ్రహం నిరంతరాయంగా లభిస్తుంది.
  2. గాజు వస్తువులు: ఇంట్లో గాజు వస్తువుల దోషాలు కూడా ఉంటాయి. వాస్తు శాస్త్ర నిపుణుల సూచనల ప్రకారం అద్దం సరైన దిశలో ఉంచకపోతే కుటుంబంలో సమస్యలు ఏర్పడుతాయి. అది డబ్బు కొరతకు దారితీస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి అద్దం ఉత్తరం వైపున ఉండాలి. ఇది శుభప్రదంగా భావిస్తారు.
  3. మనీ ప్లాంట్: ఇంట్లో మనీ ప్లాంట్ ఉండటం చాలా మంచిది. ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే ఆ ఇంట్లో ఆనందం-శ్రేయస్సు అంతగా వృద్ధి చెందుతాయి. మనీ ప్లాంట్‌ను నాటడం ద్వారా ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. అనేక చింతలు తొలగిపోతాయి. మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఉత్తరం వైపు ఉంచాలని గుర్తుంచుకోండి.
  4. వంటగది: వాస్తు శాస్త్రం ప్రకారం.. వంటగది ఉత్తరం వైపున ఉండాలి. ఇలా ఉంటే మంచిదంటారు. అన్నపూర్ణ దేవి ఎల్లప్పుడు ఇక్కడే ఉంటుందని నమ్ముతారు. ఆహార కొరత ఎప్పుడూ ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం