Phulera Dooj: పువ్వులతో హోలీని ఆడే రోజు ఫూలేరా దూజ్.. ఈ రోజున దంపతులు రాధాకృష్ణులను పుజిచడం వలన కలిగే ఫలితాలు ఏమిటంటే..

|

Mar 10, 2024 | 7:36 AM

ఈ సంవత్సరం ఈ పండుగను మార్చి 12, మంగళవారం జరుపుకోనున్నారు. ముఖ్యంగా ఈ రోజున కన్నయ్య భక్తులు రాధా-కృష్ణులను పూజిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున మధుర , బృందావనంలోని రాధా-కృష్ణుల విగ్రహాలను,  దేవాలయాలను అందమైన పూలతో అలంకరిస్తారు. అంతేకాదు రాధా కృష్ణుల ప్రేమకు చిహ్నంగా ప్రజలు పూలతో హోలీ ఆడతారు. పువ్వుల బొకేలను కూడా మార్చుకుని శుభాకాంక్షలు చెబుతారు. ఫూలేరా దూజ్ రోజున శ్రీకృష్ణుని పూజించి గులాల్ చల్లుకుంటారు. 

Phulera Dooj: పువ్వులతో హోలీని ఆడే రోజు ఫూలేరా దూజ్.. ఈ రోజున దంపతులు రాధాకృష్ణులను పుజిచడం వలన కలిగే ఫలితాలు ఏమిటంటే..
Flower Holi
Image Credit source: Pinterest
Follow us on

తెలుగు నెలల్లో చివరి మాసం ఫాల్గుణ మాసంలోకి రేపు అడుగు పెట్టనున్నాం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. అంతేకాదు  వసంత పంచమి , హోలీ వంటి పర్వదినాలు ఈ మాసంలోనే జరుపుకుంటారు. హోలీకి రెండు రోజున ముందు ఫూలేరా దూజ్ ను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ పండుగను మార్చి 12, మంగళవారం జరుపుకోనున్నారు. ముఖ్యంగా ఈ రోజున కన్నయ్య భక్తులు రాధా-కృష్ణులను పూజిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున మధుర , బృందావనంలోని రాధా-కృష్ణుల విగ్రహాలను,  దేవాలయాలను అందమైన పూలతో అలంకరిస్తారు. అంతేకాదు రాధా కృష్ణుల ప్రేమకు చిహ్నంగా ప్రజలు పూలతో హోలీ ఆడతారు. పువ్వుల బొకేలను కూడా మార్చుకుని శుభాకాంక్షలు చెబుతారు. ఫూలేరా దూజ్ రోజున శ్రీకృష్ణుని పూజించి గులాల్ చల్లుకుంటారు.

శుభ కార్యాలకు ప్రత్యేక రోజు

పువ్వులతో హొలీ ఫాల్గుణ మాసంలో చాలా ప్రత్యేకమైన, పవిత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఈ రోజు దోషాలు లేనిది.  దీని ఫలితంగా ఈ రోజున ఏదైనా పని మొదలు పెట్టినా నెరవేరుతుంది. అంతేకాదు ఈ రోజు  శుభ ముహూర్తాన్ని చూసుకోకుండా.. ఏ శుభ కార్యమైనా చేయవచ్చు అని విశ్వాసం. అందుకే ఈ రోజును అబుజ్ ముహూర్తం (స్వయం సిద్ధి ముహూర్తం) అని కూడా అంటారు. ఫూలేరా దూజ్ రోజున వివాహం చేసుకోవడం శుభ ఫలితాలను తెస్తుందని.. ఈ రోజున చేసే ఏదైనా శుభ కార్యమైనా విజయం లభిస్తుందని విశ్వాసం.

ఫూలేరా దూజ్ ప్రాముఖ్యత

వైవాహిక సంబంధాలను మరింత మధురంగా.. గాఢంగా పెనవేసుకునేలా ఈ పండుగను జరుపుకుంటారు.  ఫులేరా దూజ్ పండుగ హోలీ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఫూలేరా దూజ్ పవిత్రమైన రోజు లేదా శుభ సమయం.ఈ రోజున  భక్తులు ఉపవాసం పాటిస్తారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఆశీర్వాదం కోసం శ్రీకృష్ణుడిని పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు