హిందూ మతంలో పూజ సమయంలో లేదా ఆలయాల్లో ప్రదక్షిణ చేసే సంప్రదాయం ఉంది. దేవతలకు లేదా దేవుళ్లకు ప్రదక్షిణ చేయడం పూజలో భాగంగా పరిగణించబడుతుంది. అందుకే పూజ సమయంలో చాలా మంది తమ చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తారు. నమ్మకం ప్రకారం ఇలా ప్రదక్షిణ చేయడం ప్రతికూలతను తొలగిస్తుంది. వ్యక్తి ఆలోచనలను సానుకూలం చేస్తుంది. భగవంతుడిని ప్రదక్షిణ ద్వారా ప్రసన్నం చేసుకోవచ్చు.
చాలా మంది భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. అయితే ఏ దేవుడికి ఎలా పరిక్రమ లేదా ప్రదక్షిణ నిర్వహించాలో చాలా మందికి తెలియదు. దీంతో ప్రదక్షిణ చేసినా పూర్తి ప్రయోజనం వారికి లభించదు. ఏ దేవుళ్ళకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.
విశ్వాసం ప్రకారం వినాయకుడికి నాలుగు ప్రదక్షిణలు చేయాలి. సూర్య భగవానునికి ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి. విష్ణువు సహా అతని అన్ని అవతారాల ఆలయాల చుట్టూ నాలుగు ప్రదక్షిణాలు చేయాలి. దుర్గాదేవి పరిక్రమ నిర్వహిస్తారు. హనుమంతుడి చుట్టూ మూడు ప్రదక్షణలు చేయాలి. రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో శివలింగానికి చేసే జలాభి షేకం నీటిని దాటకూడదని నమ్ముతారు. కనుక శివాలయంలో సగం ప్రదక్షిణ చేసే సంప్రదాయం ఉంది. అందువల్ల నీటి జలాభిషేకం చేసే పవన వటం కు చేరుకున్న తర్వాత మాత్రమే ప్రదక్షిణ సంపూర్ణంగా పరిగణించబడుతుంది.
శాస్త్రీయ దృక్కోణం నుండి చూస్తే భౌతిక శక్తి అభివృద్ధికి దేవుడికి చెందిన దేవాలయాల్లో చేసే ప్రదక్షిణలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. పరిక్రమ ఎల్లప్పుడూ కుడి వైపు నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే విగ్రహాలలో ఉన్న సానుకూల శక్తి ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తుంది. ఎడమ వైపు ప్రదక్షిణ చేయడం ద్వారా మన శరీరం ఆలయ సానుకూల శక్తితో విభేదిస్తుంది. దీని వల్ల మనకు ప్రదక్షిణ ప్రయోజనం ఉండదు. కుడి అంటే దక్షిణంగా కూడా పరిగణించబడుతుంది. అందుకే పరిక్రమను ప్రదక్షిణ అని కూడా అంటారు.
ప్రదక్షిణ ఎల్లప్పుడూ పూర్తి విశ్వాసంతో, నిర్మల మైన హృదయంతో చేయాలి. ప్రదక్షిణ సమయంలో నిత్యం భగవంతుని ధ్యానిస్తూ పరిక్రమ మంత్రాన్ని జపించాలి. పరిక్రమ చేయడం వల్ల ఒక వ్యక్తికి శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఒక వ్యక్తి సమస్యల నుండి ఉపశమనం పొందుతాడు. ప్రతికూల శక్తి నుంచి విముక్తి పొందుతాడు. సానుకూల శక్తి లోపల తిరుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు