Om Chant Benefits: ‘ఓం’ జపం చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసా?.. తెలియకపోతే ఇప్పుడే తెలుసుకోండి..

Om Chant Benefits: ఓం, ఓమ్, లేదా ఓంకారం త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది.

Om Chant Benefits: ‘ఓం’ జపం చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసా?.. తెలియకపోతే ఇప్పుడే తెలుసుకోండి..
Om

Updated on: Nov 23, 2021 | 5:37 AM

Om Chant Benefits: ఓం, ఓమ్, లేదా ఓంకారం త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.ఇదొక ఏకాక్షర మంత్రము.సృష్టి ఉత్పత్తి ప్రక్రియ శబ్దముతోబాటు జరిగినది. ఎప్పుడైతే మహావిస్ఫోటనం జరిగిందో అప్పుడే ఆదినాదము ఉత్పన్నం జరిగింది. ఆ మూల ధ్వనికే సంకేతము ‘ఓం’ అని చెప్పబడింది. ఈ ‘ఓం’ అనే శబ్ధాన్ని యోగా, ధ్యానం చేసే సందర్భంలో పఠిస్తుంటారు. ఈ ఓం పదాన్ని జపించడం వల్ల.. అనేక ప్రయోనాలు ఉన్నాయని వేదాలు, పండితులు చెబుతున్నారు. దీనిని నిత్యం జపిస్తే నెగిటీవ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శరీరాన్ని, మనసును ఒకేసారి చైతన్యవంతం చేస్తుంది. మానసిక శాంతి, శక్తి లభిస్తుంది.

‘ఓం’ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
1. ఒత్తిడి, ఆందోళన, టెన్షన్‌ నుంచి విముక్తి కలిగిస్తుంది.
2. నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
3. మీ భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో, ఒత్తిడితో కూడిన పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
4. ఓం జపించడం వల్ల దృష్టి మెరుగుపడుతుంది.
5. ఇది మీ జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతా శక్తిని మెరుగుపరుస్తుంది.
6. సానుకూల శక్తిని పెంపొందిస్తుంది, మిమ్మల్ని మరింత ఆశాజనకంగా చేస్తుంది.
7. కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది.
8. మీకు కడుపులో నొప్పి సమస్య ఉంటే.. ఓం జపించడం మీకు దివ్యౌషధం.
9. ఓం జపించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
10. ఇది మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.
11. ఓం జపం చేయడం వల్ల మీ శరీరం అంతటా కంపనాలు ఏర్పడతాయి. తద్వారా మిమ్మల్ని ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చేసే శక్తిని సృష్టిస్తుంది. మీరు ఓం అని ఎన్నిసార్లు జపిస్తే మూలాధారంతో మీ అనుబంధం అంత బలపడుతుంది.
12. ప్రారంభంలో మీరు 108 సార్లు ఓం పదాన్ని జపించవచ్చు. క్రమంగా దానిని 200-300 వరకు పెంచవచ్చు. మీరు నెలకు ఒకసారి 1008 సార్లు జపించవచ్చు. ఓం జపించడానికి మంచి సమయం ఉదయం 6, మధ్యాహ్నం 12, సాయంత్రం 6, దీనిని సంధ్యా కాలం లేదా శుభ సమయం అంటారు.
13. అలాగే మీరు మీ సౌలభ్యం ప్రకారం మీకు కావలసినన్ని సార్లు, మీకు కావలసిన సమయంలో ఓం ను జపించవచ్చు. మీరు రోజులో ఎప్పుడైనా మీకు కావలసినప్పుడు ఓం జపించవచ్చు, ఎవరైనా దీన్ని చేయవచ్చు.

Also read:

Two Wheelers: ఈ ఏడాది బైక్‌ల విక్రయాలకు పెద్ద ఎదురుదెబ్బ.. కారణాలు ఇలా ఉన్నాయి..?

Ratan Tata: అందుకే ఈ యువకుడి ప్రతిభకు రతన్‌ టాటా సైతం ఫిదా అయ్యారు..

జీవితంలో అనేక బాధలతో ఇబ్బందిపడుతున్నారా..! అయితే ఈ 5 విషయాలు తెలుసుకోండి..